ఇక ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ లో అయితే పూనకం వచ్చినట్లుగా ఊగిపోతూ ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో సెంచరీ తో చెలరేగిపోయిన రోహిత్ శర్మ ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో కూడా అదరగొట్టేసాడు. ఏకంగా 86 పరుగులు చేశాడు. ఒకానొక సమయంలో రోహిత్ శర్మ దూకుడు చూస్తే ఎంతో ఈజీగా సెంచరీ చేయడం ఖాయమనుకున్నప్పటికీ ఆ తర్వాత క్యాచ్ అవుట్ అయ్యాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటికే రికార్డులు కొల్లగొడుతున్న రోహిత్ శర్మ ఇటీవల మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి.
సిక్సర్లు కొట్టడంలో రోహిత్ శర్మ తోపు అన్న విషయాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ ఏడాది వన్డే ఫార్మాట్లో పవర్ ప్లే లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా ఘనత సాధించాడు రోహిత్ శర్మ. ఏకంగా పవర్ ప్లే లో 453 బంతులు ఎదుర్కొన్న హిట్ మాన్ 31 సిక్సార్లు కొట్టాడు. అయితే రోహిత్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు అని చెప్పాలి ఆస్ట్రేలియా ఆటగాళ్లు 780 బంతుల్లో 29 సిక్సర్లు కొడితే.. సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు 840 బంతులు ఎదుర్కొని 18 సిక్సర్లు మాత్రమే కొట్టారు. అదే సమయంలో అన్ని ఫార్మాట్లలో 562 సిక్సర్లు కొట్టి అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గాను రోహిత్ శర్మ ఒక ప్రపంచ రికార్డును సృష్టించాడు అన్న విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి