ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా భారత దయాది దేశమైన పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది అని చెప్పాలి. పటిష్టమైన జట్టుగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమ్స్ లలో ఒకటిగా ఉన్న పాకిస్తాన్ సరైన ప్రదర్శన చేయలేక మొదటి నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. అయితే ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ జట్టు ఎంతో ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ ఆడింది అన్న విషయం తెలిసిందే. చిరకాల ప్రత్యర్థి అయిన భారత్ ను వారి సొంత గడ్డమీదనే ఓడించేందుకు బరిలోకి దిగింది పాకిస్తాన్.


 కానీ ఇలా భారత్ ను సొంత గడ్డమీద ఓడించాలి అని కలలుగన్న పాకిస్తాన్కు అది కలగానే మిగిలిపోయింది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఓడిస్తూ పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వచ్చిన భారత జట్టు.. 2023 వన్డే వరల్డ్ కప్ లో కూడా ఇదే విజయ పరంపరను కొనసాగించింది  పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక పాకిస్తాన్ ఆట తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే భారత్ చేతిలో ఓడిపోయి విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ తర్వాత పటిష్టమైన ఆస్ట్రేలియాను ఎదుర్కోవాల్సి ఉంది. ఈనెల 20వ తేదీన పాకిస్తాన్ మ్యాచ్ ఆడబోతుంది అని చెప్పాలి.


 అయితే ఇలా భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయి బాధలో ఉన్న పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తుంది. ఆ జట్టు కీలక ఆటగాళ్లు వైరల్ ఫీవర్ బారిన పడినట్లు సమాచారం. బెంగళూరు వాతావరణానికి వీరు అనురాగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 20వ తేదీన ఆస్ట్రేలియా తో పాకిస్తాన్ తలబడబోతున్న మ్యాచ్లోగా వైరల్ ఫీవర్ బారిన పడిన ఆటగాళ్లు కోలుకుంటారా లేదా అన్నది అనుమానంగా మారింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మ్యాచ్ సమయానికి ఆటగాళ్లు కోలుకునే పరిస్థితి లేదని తెలుస్తుంది. దీనిపై పాకిస్తాన్ జట్టు మేనేజ్మెంట్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: