ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఉత్కంఠభరితంగా సాగుతూ ఉంది అని చెప్పాలి. ఎందుకంటే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే ఏ టీమ్స్ అత్యుత్తమ ప్రదర్శన చేస్తాయి అనే విషయంపై ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా కొన్ని అంచనాలను పెట్టుకున్నారు. అయితే క్రికెట్ చరిత్రలో ఛాంపియన్స్ గా కొనసాగుతున్న టీమ్స్ మరోసారి అత్యుత్తమ ప్రదర్శన చేయడం ఖాయమని భావించారు. ఇక ఎప్పటిలాగానే పసికూన టీమ్స్ ఛాంపియన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయి చెత్త రికార్డులు మూటగట్టుకుంటాయని అందరూ అంచనా వేశారు.


 కానీ తీరా వరల్డ్ కప్ ప్రారంభమైన తర్వాత చూస్తే మాత్రం అందరి అంచనాలు తారుమారు అయిపోతున్నాయి అని చెప్పాలి. ఎందుకంటే ఛాంపియన్ టీమ్స్ చెత్త ప్రదర్శన చేస్తూ ఉంటే ఎలాంటి అంచనాలు లేని పసికూన జట్లు మాత్రం అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఛాంపియన్స్ కే షాప్ ఇస్తూ ఉండడం చూస్తూ ఉన్నాము. మొన్నటికి మొన్న ఏకంగా ఇంగ్లాండ్ జట్టును ఆఫ్ఘనిస్తాన్ 69 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. ఏదో పొరపాటున ఇలా జరిగింది అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అరవీర భయంకర సౌత్ ఆఫ్రికాకు కూడా ఇలాంటి పరాజయమే ఎదురైంది.


 ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో పటిష్టమైన టీం గా ఉన్న సౌతాఫ్రికా దారుణమైన ఓటమిని చవి చూసింది. నెదర్లాండ్స్ 38 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా ను ఓడించింది. ఈ క్రమంలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డే ఫార్మాట్లో సౌత్ ఆఫ్రికా ను ఓడించిన తొలి అసోసియేట్ జట్టుగా నిలిచింది నెదర్లాండ్స్. 2022 టీ20 వరల్డ్ కప్ లోను ప్రోటీస్ జట్టును నెదర్లాండ్స్ 13 పరుగులు తేడాతో ఓడించింది. ఇక టి20 ఫార్మాట్ లోను ఈ ఘనత సాధించిన తొలి అసోసియేట్ టీమ్గా కూడా నెదర్లాండ్స్ జట్టు నిలవడం గమనార్హం. కాగా టెస్ట్ హోదా లేని, ఐసీసీలో పూర్తిస్థాయి సభ్యత్వం లేని జట్లను అసోసియేట్ టీమ్స్ అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: