ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి టైటిల్ రేసులో నిలవాలని భావించి నిరాశకు గురైన ఫ్రాంచైజీలు అన్నీ కూడా ఇక ఇప్పుడు అత్యుత్తమ ఆటగాళ్లను జట్టులోకి తీసుకొని ఇక తమ టీంను పటిష్టంగా మార్చుకోవాలని ప్లాన్ వేసాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరల్డ్ కప్ లో భాగంగా ఎవరు అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నారు అనే విషయాన్ని బాగా గమనిస్తూ ఉన్నాయి. ఇక మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లను జట్టులోకి తీసుకునేందుకు ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరల్డ్ కప్ 2023లో అదరగొడుతున్న నెదర్లాండ్స్ కి చెందిన ఆల్ రౌండర్ 2024 ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.
నెదర్లాండ్స్ ఆల్రౌండర్ బాస్ డి లీడే అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు. ఒకవైపు బ్యాటింగ్ తో మరోవైపు బౌలింగ్ లో కూడా రాణిస్తూ ఇక ఒంటి చేత్తో జట్టును గెలిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ఈ ఆటగాడి పై ఐపీఎల్ ఫ్రాంచైజీల కన్ను పడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే 2024 సీజన్ కోసం ఇప్పటినుంచి అతని కోసం ఫ్రాంచైజీలు ప్రయత్నిస్తున్నాయి కొంచెం డబ్బు ఎక్కువ వెచ్చించి అయినా సరే ఇక అతని జట్టులోకి తీసుకోవాలని పోటీపడేందుకు సిద్ధమవుతున్నాయి అన్నది తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి