అయితే హార్దిక్ పాండ్యా దూరం కావడంతో అతని స్థానంలో మహమ్మద్ షమీతో పాటు సూర్యకుమార్ యాదవ్ లను రీప్లేస్ చేశారు సెలెక్టర్లు. ఇక ఇప్పుడు హార్దిక్ పాండ్యా వస్తే ఎవరిని జట్టు నుంచి తప్పిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇదే విషయం గురించి పాకిస్తాన్ మాజీ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హార్థిక్ పాండ్యా భారత జట్టులోకి వచ్చినప్పటికీ బౌలర్లు ఎవరిని కూడా తప్పించవద్దు అంటూ సూచించాడు.
అయితే బ్యాటింగ్లో ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్న శ్రేయస్ అయ్యర్ ని మాత్రం హార్దిక్ వచ్చిన తర్వాత జట్టు నుంచి పక్కన పెట్టాలి అంటూ సూచించాడు. అలాగే పూర్తిస్థాయి ఫిట్న సాధించిన తర్వాతనే హార్దిక్ పాండ్యాను తుది జట్టులోకి తీసుకుంటే మంచిది అంటూ సలహా ఇచ్చాడు పాక్ మాజీ. సగం ఫిట్నెస్ సాధించిన తర్వాత హార్థిక్ పాండ్యను తీసుకుంటే భారత బౌలింగ్ విభాగానికి అది ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే బౌలర్ను డ్రాప్ చేయాల్సి వస్తుంది అంటూ తెలిపాడు. అయితే శ్రేయస్ ఈ వరల్డ్ కప్ లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. ఇంగ్లాండ్తో మ్యాచ్లను 16 బంతుల్లో నాలుగు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ వరల్డ్ కప్ లో అతని షార్ట్ బాల్ వీక్నెస్ వేధిస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి