అయితే ప్రస్తుతం భారత జట్టు దూకుడు చూస్తూ ఉంటే.. ఎట్టి పరిస్థితుల్లో అటు వరల్డ్ కప్ లో టీం ఇండియా విజయం సాధించడం ఖాయమని అభిమానులు అందరూ కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. అయితే రేపు ఇక సెమి ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో మ్యాచ్ ఆడబోతుంది టీమిండియా. అయితే ఈ వరల్డ్ కప్ ను భారత జట్టు తప్పకుండా గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దీనికి కారణం జట్టులో ఉన్న సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లకు ఇదే చివరి వరల్డ్ కప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తర్వాత వరల్డ్ కప్ నాటికి కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇదే విషయం గురించి టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ మాట్లాడుతూ.. రోహిత్ కు ఇదే చివరి వరల్డ్ కప్ కావచ్చు అంటూ అభిప్రాయపడ్డాడు. రోహిత్ కి ప్రస్తుతం 36 ఏళ్ళు మరో నాలుగు సంవత్సరాల్లో 40 ఏళ్ళు నిండుతాయి. సాధారణంగా భారత క్రికెటర్లు ఆ వయసులో ఇంటర్నేషనల్ క్రికెట్కు ఆడాలని అస్సలు అనుకోరు. అందుకే రోహిత్ తన కెప్టెన్సీలో టీం ఇండియాకు వరల్డ్ కప్ అందించాలని కోరుకుంటున్నాడు అంటూ అభిప్రాయపడ్డాడు దినేష్ లాడ్. ఇక విరాట్ కోహ్లీ ఈ వరల్డ్ కప్ లో తప్పకుండా తన 50వ వన్డే సెంచరీ సాధిస్తాడు అంటూ ధీమా వ్యక్తం చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి