2023 వన్డే వరల్డ్ కప్ లో అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ఎంత దారుణమైన పరాజయాలను చవిచూసిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు  పాకిస్తాన్ క్రికెట్ హిస్టరీ లోనే ఎన్నడూ లేని విధంగా చిన్న టీమ్స్ చేతుల్లో సైతం దారుణం గా ఓడిపోయి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. ఇక వరుస ఓటములతో సతమతమైంది అని చెప్పాలి. బ్యాటింగ్ విభాగం లో బౌలింగ్ విభాగం లో ఎక్కడ సత్తా చాట లేక పోయింది.


 ఈ క్రమంలోనే ఇక వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగి అంచనాలను అందుకోలేక.. చివరికి లీగ్ దశతోనే సరిపెట్టుకుంది ఈ టీం. ఇక అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటూ అదరగొడుతుంది అనుకుంటే సెమీఫైనల్ లో అడుగుపెట్టకుండానే చివరికి టోర్నీ నుంచి నిష్క్రమించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెట్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. జట్టులో ఉన్న ఆటగాళ్ళను ఎంపిక చేయడంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వివక్షపూరితంగా వ్యవహరించింది అంటూ ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ దేశ క్రికెట్ వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది అంటూ ఎంతో మంది అభిప్రాయపడుతున్నారు.


 అయితే ఇదే విషయం గురించి మాట్లాడిన పాకిస్తాన్ మాజీ బౌలర్ అమీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని చేసిన పనిని గుర్తు చేస్తూ అతనిపై ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ కప్ లో పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శనకు దేశ క్రికెట్ వ్యవస్థను నిందించడం సరికాదు అంటూ అమీర్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ బాబర్ తీరు మారాలి అంటూ సూచించాడు. భారత క్రికెట్ను ధోని వేరే స్థాయికి తీసుకువెళ్లారు. కానీ అందుకోసం ఆయన వ్యవస్థను మార్చలేదు. కేవలం జడేజా అశ్విన్ లాంటి వాళ్లకు జట్టులో అవకాశం కల్పించారు అంటూ అమీర్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: