ఇక ఆ దేశ మాజీల సైతం ఏకంగా పాకిస్తాన్ జట్టు తరఫున ఆడుతున్న ఆటగాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు కూడా చేశారూ. అయితే ఈ వరల్డ్ కప్ టోర్నీలో దారుణంగా విఫలమైన పాకిస్తాన్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న బాబర్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలి అంటూ డిమాండ్లు వచ్చాయి. అయితే ఇక వరల్డ్ కప్ లో లీగ్ దశ నుంచి నిష్క్రమించి ఇంటికి వెళ్ళింది పాక్. కాగా పాకిస్తాన్ స్వదేశానికి చేరుకున్న తర్వాత ఇక జట్టులో ప్రక్షాళన చేయడానికి ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇక పాకిస్తాన్ జట్టు కోసం పనిచేస్తున్న విదేశీ కోచింగ్ సిబ్బందిని కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
కొంతమంది జట్టు ఓటమికి బాధ్యత వహిస్తూ స్వచ్ఛందంగా అటు రాజీనామాలు కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. బాబర్ ఇప్పటికే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇక గతంలో పాకిస్తాన్ చీఫ్ సెలెక్టర్ కూడా ఇలాగే రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ జట్టుకి కొత్త చీఫ్ సెలెక్టర్గా ఆ జట్టు మాజీ బౌలర్ రియాజ్ నియమితుడు అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటన చేసింది. ఇక టీం డైరెక్టర్ గా హఫీస్ పేరును ప్రకటించింది. ఇక ఇప్పటికే బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. t20 లకు షాహీన్, టెస్టులకు షాన్ మసూద్ లను కెప్టెన్లుగా నియమించింది అన్న విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి