ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో టి20 ఫార్మాట్ కు పెరిగిపోతున్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా టి20 ఫార్మాట్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతేకాదు టీ20 మ్యాచ్లను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఎందుకంటే టెస్ట్ ఫార్మాట్ లాగా ఫలితం కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకపోవడం.. వన్డే ఫార్మాట్ లాగా ఒక రోజు మొత్తం ఇక మ్యాచ్ చూడాల్సిన అవసరం లేకపోవడంతో టీ20 ఫార్మాట్ కి బాగా ఆకర్షితులవుతున్నారు క్రికెట్ ప్రేక్షకులు.


 ఏకంగా ప్రేక్షకులందరికీ కావాల్సిన ధనాధన్ ఇన్నింగ్స్ కూడా అటు టి20 ఫార్మాట్లో కనిపిస్తూ ఉండడంతో ఇక మిగితా ఫార్మాట్లను పట్టించుకోవడమే మానేస్తున్నారు అని చెప్పాలి. ఇలా పొట్టి ఫార్మాట్కు క్రేజ్ పెరగడం మంచిదే. కానీ ఈ క్రేజ్ కారణంగా ఇతర ఫార్మట్లు ప్రమాదంలో పడిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొన్నటివరకు ఇక ఇదే విషయంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే వన్డే ఫార్మాట్లో ప్రస్తుతం 50 ఓవర్లతో మ్యాచ్ ఆడిస్తున్నారు. ఓవర్ల సంఖ్యను కుధిస్తే బాగుంటుందని గతంలో ఎంతో మంది మాజీలు అభిప్రాయపడ్డారు.


 ఇక ఇటీవలే ఇదే విషయం పై స్పందించిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసిం అక్రమ్ సైతం ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు  వన్డేలకు మునుపటి అనుభవం తెచ్చేందుకు.. ఇక 50ఓవర్ల ఆటను 40 ఓవర్లకు కుదించాలి అంటూ సూచించాడు  10 నుంచి 40 ఓవర్ల మధ్యలో మ్యాచ్ స్వరూపం మారేంతలా ఏమి జరగదు  అదే ఇక్కడ సమస్య. 40 ఓవర్లకు మ్యాచ్ కుదిస్తే వన్డే ఫార్మాట్లో ఆట మరింత ఆసక్తికరం గా మారుతుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. టి20 హవా నడుస్తున్న నేటి తరుణంలో ఇకపై వన్డే వరల్డ్ లను చూస్తామో లేదో అంటూ కామెంట్ చేశాడు వసీం అక్రమ్.

మరింత సమాచారం తెలుసుకోండి: