టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా  కొనసాగుతున్న రిషబ్ అంత కొంతకాలం నుంచి క్రికెట్ ఆటకు పూర్తిగా దూరమైపోయాడు. దీనికి కారణం గత ఏడాది డిసెంబర్ నెలలో అతను ఘోరమైన రోడ్డు ప్రమాదం పారినపడటమే. ఏకంగా అతను ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదం బారిన పడగా.. ఇక ఈ ప్రమాదంలో రిషబ్  తీవ్ర గాయాలయ్యాయ్. అయితే ఈ యాక్సిడెంట్ తర్వాత అతను కొన్ని సర్జరీలు కూడా చేయించుకున్నాడు అని చెప్పాలి.


ఇక ఈ ప్రమాదంతో అతను పూర్తిగా క్రికెట్ కు దూరం అయిపోయాడు. కేవలం మంచానికే పరిమితం అయ్యాడు. అయితే ఇక పట్టుదలతో ఎంతో వేగంగా కోలుకుంటూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక మళ్ళీ తన కెరీర్ ను కొనసాగించాలని ఆశ పడుతూ ఉన్నాడు. దాదాపు రిషబ్ పంత్ క్రికెట్ ఆడి ఏడాది గడిచిపోతుంది. దీంతో అతను ఎప్పుడేప్పుడు మళ్ళీ ప్రొఫెషనల్ క్రికెట్ లోకి వస్తాడ అని అభిమన్ అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారూ అని చెప్పాలి. అయితే 2024 ఐపీఎల్ సీజన్లో అతను ఢిల్లీ తరఫున మళ్లీ బరిలోకి దిగే అవకాశం ఉంది అని అందరూ అంచనా వేశారు.


 కానీ రిషబ్ పంత్ నిజంగానే పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడా లేదంటే చివరి నిమిషంలో ఏదైనా ట్విస్ట్ ఇస్తాడా అనే విషయంపై కూడా అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఇటీవలే దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో రిషబ్ పంత్ ప్రత్యేక ఆకర్షణ నిలిచాడు. ఆటగాళ్ల కొనుగోళ్లలో తన అభిప్రాయాన్ని జట్టు చెబుతూ కనిపించాడు. అయితే ప్లేయర్లను దక్కించుకునేందుకు ప్రైస్ కార్డులను ప్రదర్శించాడు.. ఇక ఇదంతా చూస్తే రిషబ్ పంత్ 2024 ఐపిఎల్ లో ఆడటం ఖరారు అయిపోయినట్టే అని ఫ్యాన్స్ అందరూ సంతోష పడిపోతున్నారు. అయితే జట్టులోకి వచ్చిన తర్వాత అతని సారథిగా కొనసాగిస్తార లేదంటే వార్నర్ ని కెప్టెన్ గా ఉంచుతార అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl