బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరల్డ్ క్రికెట్లో అంతకంతకు మంచి గుర్తింపును సంపాదించుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఇప్పటికే క్యాష్ రిచ్ లీగ్ గా కూడా పేరు సంపాదించుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ లీగ్ లో పాల్గొంటే ఒకవైపు అనుభవంతో పాటు మరోవైపు ఆదాయం కూడా భారీగానే వస్తుంది.


 ఇక ఐపీఎల్ లో రాణిస్తే వచ్చే పాపులారిటీకి కూడా ఎక్కడా కొదవలేదు అని చెప్పాలి. దీంతో ఇక దేశ విదేశాల నుంచి కూడా క్రికెటర్లు ఈ ఐపీఎల్ టోర్నీలో పాల్గొనాలని ఎంతగానో ఆశ పడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ప్రతిసారి కూడా వేలంలో తమ పేరును రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది క్రికెటర్లు అయితే ఏకంగా దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం కంటే ఐపిఎల్ లో ఆడడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చేస్తూ ఉంటారు. దీంతో ఇక ఐపీఎల్ కోసం ఏదో ఒక ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించి ఈ టోర్నీకి అందుబాటులో ఉండాలని అనుకుంటూ ఉంటారు. కొంతమంది మాత్రం భారీగా ఆదాయం వస్తున్న ఐపిఎల్ ను పక్కనపెట్టి మరీ దేశం కోసం ఆడటానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.


 అలాంటివారిలో ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న ప్యాట్ కమిన్స్ కూడా ఒకరు. అతను దాదాపు మూడేళ్లుగా ఐపీఎల్లో ఆడటం లేదు. ఇక చాలా గ్యాప్ తర్వాత మళ్లీ 2024 ఐపీఎల్ సీజన్ కోసం అందుబాటులో ఉన్నాడు  అయితే ఇటీవల అతనికి 20.50 కోట్లు ధర దక్కింది. ఇంత ధర దక్కిన తర్వాత ఎవరైనా సరే ఐపీఎల్ గురించి గొప్పగా మాట్లాడుతారు. కానీ ఇటీవలే ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ 2024 t20 వరల్డ్ కప్ కోసం ఐపీఎల్ ప్రిపరేషన్ లాగా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. సన్రైజర్స్ టీం గురించి చాలా విన్నానని ఆ జట్టుతో కలిసి ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాను అంటూ తెలిపారు. ఇక ఇది విన్న నేటిజన్స్ అతను 20 కోట్ల ఆదాయం వస్తున్నా.. దేశం కోసం వరల్డ్ కప్ గెలిపించడం గురించి ఆలోచిస్తున్నాడని.. అందరూ అతనిల ఉంటే బాగుంటుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl