ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలోకి అడుగుపెట్టిన రెండు సీజన్స్ లోనే లక్నో జట్టు మంచి గుర్తింపును సంపాదించుకుంది అన్న విషయం తెలిసిందే. ఆట తీరుతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునీ అభిమానులుగా మార్చుకుంది. ఈ క్రమంలోనే ఇక 2024 ఐపీఎల్ సీజన్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రస్తుతం ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే జట్టుకు భారంగా మారిన ప్లేయర్లను ఇటీవల వేలంలోకి వదిలేసి కొత్త ఆటగాళ్ళను టీం లోకి చేర్చుకుంది.


 ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన మినీ వేలంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి.. ఇక జట్టుకు ఏ ఆటగాళ్లు అయితే సరిపోతారో ఇక అలాంటి ప్లేయర్లను ఇతర ఫ్రాంచైజీ లతో పోటీపడి మరి దక్కించుకుంది అని చెప్పాలి. అయితే ఇక 2024 ఐపిఎల్ సీజన్ కోసం ప్రస్తుతం లక్నో అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతూ ఉండగా.. ఇటీవల ఒక ఆటగాడి విషయంలో మాత్రం ఆ జట్టుకు ఊహించిన షాక్ తగిలింది. జట్టుకు ఉపయోగపడతాడు అని భావించి ఇటీవల ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేసి మరీ జట్టులోకి తీసుకున్న ఆటగాడు.. ఇక ఇప్పుడు ఇక ఐపీఎల్ టోర్నీకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.


 ఆస్ట్రేలియా జట్టులో విధ్వంసకర ఆటగాడిగా కొనసాగుతున్న యాష్టన్  టర్నర్ ను ఏకంగా కోటి రూపాయలకే దక్కించుకుంది లక్నో సూపర్ జెయింట్స్ జట్టు. కానీ ఆ టీంకి ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది. బిగ్ బాష్ లీగ్ లో స్కార్చేర్స్ కెప్టెన్ గా ఉంటున్న టర్నర్ ఇటీవల హోంబర్ట్ తో జరిగిన మ్యాచ్లో గాయం బారిన పడ్డాడు. దీంతో అతను బిగ్ బాష్ లీగ్ లోని మిగిలిన మ్యాచ్లు అన్నింటికీ కూడా దూరం అయ్యాడు అని చెప్పాలి  అయితే అతని మోకాలికి ఇటీవల సర్జరీ జరిగింది అనేది తెలుస్తుంది  దీంతో కొన్ని నెలల పాటు అతను విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఐపీఎల్ టోర్ని మార్చి నెలలో ప్రారంభమవుతున్న నేపథ్యంలో అప్పటివరకు అతను గాయం నుంచి కోలుకొని ఫిట్నెస్ సాధిస్తాడ లేదో అనే విషయంపై కన్ఫ్యూజన్ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl