గత కొంతకాలం నుంచి టీమిండియా వరల్డ్ క్రికెట్లో తిరుగులేని టీం గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. పటిష్టమైన ప్రత్యర్ధులను సైతం ఎంతో అలవోకగా ఓడిస్తూ.. ఇక ఎన్నో అద్వితీయమైన విజయాలను కూడా సాధిస్తుంది  ఫార్మాట్ తో సంబంధం లేకుండా అదరగొడుతుంది అని చెప్పాలి. భారత జట్టులోని ప్లేయర్లు అందరూ కూడా తమ ఆట పేరుతో ఎన్నో అరుదైన రికార్డులు కూడా సృష్టిస్తూ ఉండడం గమనార్హం. అయితే ప్రస్తుతం భారత జట్టు అటు సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉంది అన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్లలో కూడా సిరీస్ లు ఆడుతుంది టీమిండియా.


 అయితే ఇక ఇటీవలే వన్డే సిరీస్ ను సొంతం చేసుకుంది. ఏకంగా సఫారీ జట్టును వారి సొంత గడ్డమీదనే ఓడించి సత్తా చాటింది భారత జట్టు. ఈ క్రమంలోనే టీమిండియా ఆట తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు  అయితే ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకోగా ఇక ఒక అరుదైన రికార్డును కూడా సృష్టించింది భారత జట్టు. ఈ ఏడాది వన్డే ఫార్మాట్ లో అత్యధిక విజయాలు సాధించిన టీమ్ గా ఏకంగా ఓవరాల్ గా రెండో జట్టుగా నిలిచింది టీమిండియా జట్టు.  దీన్నిబట్టి ఇక ఏడాది టీమిండియా ప్రస్థానం ఎంత విజయవంతంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.


 అయితే ఇలా ఒకే ఏడాది వన్డే ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన టీమ్స్ లో అటు ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. 2003 ఏడాదిలో ఏకంగా ఆస్ట్రేలియా జట్టు వన్డే ఫార్మాట్లో 30 విక్టరీలు సాధించడం గమనార్హం. అయితే 1993లో ఆస్ట్రేలియా ఇలా ఒకే ఏడాదిలో 26 విజయాలు సాధించింది. 1996, 2000 సంవత్సరాలలో సౌత్ ఆఫ్రికా ఇలా వన్డే ఫార్మాట్లో ఒకే ఏడాది 25 విజయాలు సాధించింది అని చెప్పాలి. కాగా టీమిండియా ఇకడిసెంబర్ 26వ తేదీ నుంచి ఆతిథ్య సౌతాఫ్రికా తో టెస్టు సిరీస్ ఆడబోతుంది . రెండు మ్యాచ్లటెస్ట్ సిరీస్లో కోసం ఇక టీమిండియా సీనియర్స్ అందరూ కూడా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: