గత కొంతకాలం నుంచి ఇండియాలో క్రికెట్ పండగే కొనసాగుతూ వస్తుంది అని చెప్పాలీ. ఎందుకంటే ఇప్పటికే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమై క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతుంది. గత కొంతకాలం నుంచి ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులను అలరిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. నేడు ఇక ఫైనల్ కు చేరుకున్న ముంబై, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈసారి విజేతగా ఎవరు నిలవబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలీ.


 అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అయినా లేదంటే ఐపీఎల్లో అయినా ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన  ప్లేయర్ కి బహుమతిగా ఇచ్చేందుకు ప్రతి మ్యాచ్ లో కూడా అటు టాటా కంపెనీ ఒక కార్ ఒకచోట నిలిపి ఉంచుతుంది అన్న విషయం తెలిసిందే.అయితే ఇలా మైదానంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన ప్లేయర్కు బహుమతిగా ఇచ్చేందుకు నిలిపి ఉంచిన టాటా కంపెనీ కార్ల అద్దాలు పగలగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు.. ఏకంగా అటు ప్లేయర్లు సిక్సర్లతో చెలరేగిపోతూ ఉంటారు. అయితే ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎన్నోసార్లు ఇది జరిగింది. ఎంతో మంది ప్లేయర్లు సిక్సర్ కొట్టిన బంతులు వెళ్లి ఏకంగా టాటా పంచ్ కారు అద్దాలను పగలగొట్టాయ్. అయితే ఇటీవల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఇలాంటి ఘటన జరిగింది.



 మార్చి 4వ తేదీన యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్ ఎల్లిస్ పెర్రి  భారీ సిక్సర్ బాదగా.. అది నేరుగా వెళ్లి మైదానంలో పెట్టిన టాటా పంచ్ విండో అద్దాన్ని పగలగొట్టింది. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇలా తమ కారు అద్దాన్ని పగలగొట్టిన బెంగళూరు జట్టు ప్లేయర్ ఎల్లిస్ పెర్రికి టాటా కంపెనీ ఒక వినూత్నమైన బహుమతిని ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోకి కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏకంగా మ్యాచ్ సమయంలో సిక్సర్ దెబ్బకు డిస్ ప్లేలో ఉన్న టాటా కారు అద్దం పగలగా.. ఇలా పగిలిన గ్లాస్ ముక్కలను జోడించి ఒక మెమెంటోగా మార్చి.. ఎల్లిస్ పెర్రికి బహుమతిగా ఇచ్చింది టాటా కంపెనీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wpl