మరికొన్ని రోజులు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం భారత క్రికెట్ లో ఎక్కడ చూసినా కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి చర్చించుకుంటున్నారు. ఐపీఎల్ 17వ సీజన్లో విజేతగా నిలవబోయే టీం ఏది అనే విషయంపై అందరూ తెగ రివ్యూలు ఇచ్చేస్తున్నారు అని చెప్పాలి. ఇక అన్ని టీమ్స్ కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా అన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఎప్పటిలాగానే ఐపీఎల్లో 10 టీమ్స్ బరిలోకి దిగుతూ ఉండగా.. అటు అందరికన్ను మాత్రం ముంబై ఇండియన్స్ పైనే ఉంది అని చెప్పాలి.


 ఎందుకంటే మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా గుర్తింపును సంపాదించుకున్న రోహిత్ శర్మను.. కాదని అటు ముంబై ఇండియన్స్ యాజమాన్యం హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు ఏకంగా హార్దిక్  సారథ్యంలో రోహిత్ శర్మ ఒక సాదాసీదా  ఆటగాడిగానే జట్టులో బరిలోకి దిగిపోతున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇదిలా ఉంటే ఒకవైపు అటు ముంబై ఇండియన్స్ జట్టుకు మాత్రం వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి అని చెప్పాలి. ఎందుకంటే జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు గాయం బారిన పడుతున్నారు.



 ఈ క్రమంలోనే జట్టు వ్యూహాలు మొత్తం తారుమారు అవుతున్నాయి అని చెప్పాలి. ఇక ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చిన బెరండార్ఫ్ ఇటీవల గాయం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ చివరి నిమిషంలో ఒక ఆటగాడిని రీప్లేస్ చేసుకుంది. గాయపడ్డ ఫేసర్ బేరండార్ఫ్ స్థానంలో ఇంగ్లాండ్ క్రికెటర్ ల్యూక్ వుడ్ ను తీసుకుంది. ఇక ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ ఇంగ్లాండ్ తరఫున రెండు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్ లు ఆడాడు. అతని కేవలం 50 లక్షల బేస్ ప్రైస్ చెల్లించి ముంబై ఇండియన్స్ దక్కించుకోవడం గమనార్హం. మరి ఈ కొత్త ఆటగాడు ఎలా రానిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl