ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవాలి అనే కలను సహకారం చేసుకోలేకపోయినా టీం ఏది అంటే అందరూ కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పేరును చెబుతూ ఉంటారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ లో ఎన్నోసార్లు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన బెంగళూరు టీం.. ప్రతిసారి కూడా అభిమానులు నిరాశ పరుస్తూనే వచ్చింది. వరల్డ్ క్రికెట్లో ఉన్న స్టార్ ప్లేయర్స్ అందరూ కూడా అటు బెంగళూరు టీం లోనే కనిపిస్తూ ఉంటారు. కానీ ఎందుకో ఆ జట్టుకు మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. అయితే ఇక ఇప్పుడు కొత్త కెప్టెన్ డూప్లెసెస్ సారథ్యంలో బరిలోకి దిగిన టైటిల్ కల మాత్రం నెరవేరడం లేదు అని చెప్పాలి.


 బెంగళూరు జట్టుకు ఉన్న క్రేజ్ దృశ్య  టైటిల్ గెలవని జట్టు ఏది అంటే బెంగళూరు పేరే మొదటి వరుసలో వినిపిస్తూ ఉంటుంది. దీంతో ఒక్క ఆర్సిబి తప్ప మిగతా అన్ని టీమ్స్ కూడా ఒక్కసారైనా టైటిల్ గెలిచి ఉంటాయి అని ఎంతో మంది ఐపిఎల్ అభిమానులు అనుకుంటూ ఉంటారు. కానీ అచ్చం అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాగానే మరో రెండు టీమ్స్ కూడా ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా టైటిల్ అందుకోలేకపోయాయి. అవే పంజాబ్ కింగ్స్ తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు అని చెప్పాలి. ఈ రెండు టీమ్స్ కి కూడా ఆర్సీబీ లాగానే టైటిల్ గెలవడం అనేది ఒక కలగానే మిగిలిపోయింది. ఎంతమంది కెప్టెన్లు మారినా టైటిల్ ఆశ మాత్రం తీయడం లేదు.



 ఇప్పుడు వరకు 16 సీజన్లు గడిచిన ఈ మూడు జట్లు ఒక్క టైటిల్ కూడా అందుకోలేదు. ప్రతి సీజన్లో కూడా ఈ మూడు టీమ్స్ ని దురదృష్టం వెంటాడుతూనే ఉంది అని చెప్పాలి. ఇప్పటివరకు పలుమార్లు ఈ మూడు టీమ్స్ ఫైనల్ కు వెళ్లిన.. అక్కడ మాత్రం పరాజయాన్ని చవిచూస్తూ రన్నరఫ్ తోనే సరిపెట్టుకుంటూ ఉన్నాయి అని చెప్పాలి. ఆర్సిబి పరిస్థితి అయితే మరింత విచారకరం. మూడుసార్లు ఫైనల్ కు వెళ్లిన ఒక్కసారి కప్పు గెలవలేకపోయింది. అయితే ఈ ఏడాది ఐపిఎల్ సీజన్లో మాత్రం ఈ మూడు టీమ్స్ తమ తలరాతన మార్చుకొని ఐపీఎల్ టైటిల్ గెలిచిన టీమ్స్ లిస్టులో చేరాలని అనుకుంటున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl