ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ టీంగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఇక ఈ ఏడాది కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగబోతుంది అని చెప్పాలి. ధోని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్ ఎవరు అవుతారు అనే చర్చ ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది. అయితే మధ్యలో ధోని వారసుడిగా పేరున్న రవీంద్ర జడేజా.. చేతికి సారధ్య బాధ్యతలను అప్పగించింది జట్టు యాజమాన్యం. కానీ అతను కెప్టెన్సీలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో ఒకే సీజన్లో మళ్ళీ జడేజా చేతికి కెప్టెన్సీ అప్పగించి ఆటగాడిని గానే కొనసాగాడు రవీంద్ర జడేజా.


 దీంతో ధోనీ తర్వాత చెన్నై సూపర్ కింగ్ కి తర్వాత కెప్టెన్ ఎవరు అనే విషయంపై చర్చ తీవ్రమైంది. గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ ధోని కెప్టెన్సీలో టైటిల్ గెలిచింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది కూడా తప్పకుండా అదరగొడుతుంది అనుకుంటున్న సమయంలో.. అటు ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకొని యువ ఆటగాడు రుతురాజు గైక్వాడ్ కి సారద్య బాధ్యతలు అప్పగించాడు. అయితే అతని సారథ్యంలో చెన్నై ఎలా రానిస్తుంది అని అందరూ ఎదురు చూస్తున్న వేళ ఆ జట్టుకు మాత్రం ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఐపీఎల్ కు ముందే జట్టు ఓపెనర్ డేవాన్ కాన్వే గాయంతో అటు ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు అని చెప్పాలి.



 కాగా నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మొదటి మ్యాచ్ ఆడబోతుంది చెన్నై సూపర్ కింగ్స్. అయితే మ్యాచ్ కి ముందే చెన్నైకి మరో బిగ్ షాక్ తగిలింది. గత ఏడాది చెన్నైని తన బౌలింగ్ తో విజయ తీరాలకు నడిపించిన శ్రీలంక బౌలర్ పతిరణ తొలి మ్యాచ్ ఆడటం కష్టమే అన్నది తెలుస్తుంది. గాయం కారణంగా కొన్ని రోజులుగా అతను రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ కు వెళ్లేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు అతనికి ఇంకా NOc జారీ చేయలేదని సమాచారం. దీంతో అతను మొదటి మ్యాచ్ కి దూరం కాబోతున్నాడట. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్ లో జట్టులోకి రచిన్ రవీంద్ర  ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl