సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో ఆట ప్రమాణాలను మరింత పెంచేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇక ఎప్పుడు సరికొత్త రూల్స్ తీసుకువస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఆయా రూల్స్ ద్వారా ఆటను ప్లేయర్లకు మరింత కఠినంతరం చేస్తూ.. ఇక మరింత నాణ్యమైన క్రికెట్ ను అందిస్తూ ఉంటుంది. అయితే అటు బీసీసీఐ మాత్రం  నా రూటు సపరేటు అన్న విధంగానే వ్యవహరిస్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఐసిసి రూల్స్ సైతం పక్కనపెట్టి బీసీసీఐ నిర్వహించే ఐపిఎల్ లో తమకు నచ్చిన కొత్త రూల్స్ పెట్టడం చూస్తూ ఉంటాం. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ క్రికెట్లో లేని సరికొత్త రూల్స్ అటు ఐపీఎల్లో కనిపిస్తూ ఉంటాయి అని చెప్పాలి.



 ఇప్పటికే అటు ఐసీసీ రూల్స్ లో లేని ఇంపాక్ట్ ప్లేయర్ అనే రూల్ ని ఐపీఎల్ లో అమలు అవుతుంది. ఈ రూల్ ద్వారా మ్యాచ్ మధ్యలో ఎవరైనా ఆటగాడిని మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఐసీసీకి సంబంధం లేని మరో కొత్త రూల్ ని అటు బీసీసీఐ ఐపీఎల్ లో ప్రవేశపెట్టబోతుందట. ఏకంగా బౌలర్ రెండు షార్ట్ బౌన్సర్లు వేసేందుకు అనుమతించబోతున్నారు. ఐసీసీ రూల్స్ ప్రకారం కేవలం బౌలర్ ఒక ఓవర్ కి ఒక్క  బౌన్సర్ మాత్రమే వేసేందుకు అవకాశం ఉంటుంది.


 ఇక ఇలా ఒక బౌన్సర్ తర్వాత బౌలర్ మరో బౌన్సర్ వేశాడు అంటే ఇక అది నోబాల్ గా అంపైర్ ప్రకటించడం లాంటివి చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. కానీ ఇప్పుడు బిసిసిఐ మాత్రం కొత్త రూల్ తీసుకురాబోతుంది. ఏకంగా షార్ట్ బాల్ పేరుతో బౌలర్ ఒకే ఓవర్లో రెండు బౌన్సర్లు  వేసేందుకు అవకాశం కల్పిస్తుంది అని చెప్పాలి. అలాగే స్టంపింగ్ కోసం థర్డ్ ఎంపైర్ కు రిఫర్ చేసినప్పుడు ముందుగా క్యాచ్ ను చెక్ చేసేలా రూల్ కొనసాగించనున్నారు. ఇక అవుట్ నాట్ అవుట్ తో పాటు వైడు, నో బాల్ కూడా ఒక్కటి రెండు రివ్యూలు ఉంటాయి. అయితే ఇటీవల ఐసీసీ తీసుకొచ్చిన స్టాప్ క్లాక్ రూల్ ని మాత్రం ఐపీఎల్ లోఅమలు చేయకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc