ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఒక శకం ముగిసిందా అంటే అవును అనే సమాధానమే ప్రతి ఒక్కరి నుంచి కూడా వినిపిస్తుంది. ఎందుకంటే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ సారాధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే అంతకుముందే ఏకంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ సైతం ఆ జట్టు యాజమాన్యం సారధ్య బాధ్యతల నుంచి తప్పించి హార్థిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించింది. ఈ ఇద్దరు కూడా ఐపీఎల్ హిస్టరీలో గ్రేటెస్ట్ కెప్టెన్గా గుర్తింపును సంపాదించుకున్నార ఇక తమ జట్టు ను ఎప్పుడూ విజయపతంలో నడిపించడంలో సక్సెస్ అయ్యారు.



 ఇలా భారత క్రికెట్లో లెజెండ్స్ గా కొనసాగుతున్న ఇద్దరు కూడా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. అలా అని ఐపిఎల్ నుంచి దూరం కాలేదు. ప్రస్తుతం ఇతర సారదుల కెప్టెన్సీలో గొప్ప సారదులుగా పేరు సంపాదించుకున్న ఈ ఇద్దరు సాదాసీదా ఆటగాళ్లు గానే ప్రస్తానని కొనసాగిస్తున్నారు అని చెప్పాలి. దీంతో ఇక ఐపీఎల్ టోర్నీలో ఫ్యూచర్లో ఈ ఇద్దరినీ కెప్టెన్లుగా చూసే అవకాశం అభిమానులకు లేకుండా పోయింది అని చెప్పాలి. దీంతో ఇక ఈ ఇద్దరు క్రికెటర్లు ఐపీఎల్ లో అందించిన సేవలను అభిమానులు అందరూ కూడా నెమరు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వీరి కెప్టెన్సీలో వారి వారి జట్లు సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటున్నారు అని చెప్పాలి.


 ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు ఐపీఎల్లో గ్రేటెస్ట్ కెప్టెన్ శకం  ముగిసింది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. కాగా మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మలు వారి వారి జట్లకు ఏకంగా ఐదేసి టైటిల్స్ అందించారు. మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్సీ గా గుర్తింపును సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే ఐపీఎల్ హిస్టరీలో ధోని, రోహిత్ కలిసి 10 టైటిల్స్ గెలిస్తే ఇక ఐపీఎల్ లోని మిగతా టీమ్స్ కెప్టెన్స్ అందరూ కలిపి కేవలం 6 టైటిల్స్ మాత్రమే గెలవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl