టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన ఆట తీరుతో తన కెప్టెన్సీ తో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితుడుగా కాదు ఏకంగా ఫేవరెట్ క్రికెటర్ గా మారిపోయాడు మహేంద్ర సింగ్ ధోని అని చెప్పాలి. ఇక వరల్డ్ క్రికెట్లో ఎంతోమంది అభిమానులు ధోనిని మిస్టర్ కూల్ కెప్టెన్ అని పిలుచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే ధోని మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. ఇలాంటి నిర్ణయాలు అందరినీ షాక్ కి గురి చేస్తూ ఉంటాయి.


 అచ్చంగా ఇలాగే తన రిటైర్మెంట్ గురించి కూడా ఎవరు ఊహించని విధంగా ట్విస్టులు ఇస్తూ ఉంటాడు మహేంద్ర సింగ్ ధోని. ఈ క్రమంలోనే 2019లో తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించడం విషయంలో కూడా అభిమానులకు ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. అయితే ధోని ఇలా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన నాటి నుంచి కూడా ఐపీఎల్ కి కూడా వీడ్కోలు పలుకుతాడేమో అని అభిమానులు అందరూ కూడా ఆందోళనలోనే ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇటీవలే అనూహ్యంగా ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకొని మరో ట్విస్ట్ ఇచ్చాడు ధోని.


 చివరి నిమిషం వరకు కూడా ఈ విషయం ఎవరికీ తెలీదు. ఎప్పుడైతే రుతురాజ్ ధోని స్థానంలో కెప్టెన్ గా ఏకంగా ఫోటోషూట్ కి ఫోజులు ఇచ్చాడో అప్పుడు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఇలా మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం పై ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించారు. కెప్టెన్ల సమావేశానికి ముందే తనకు ఈ విషయం తెలిసింది అంటూ చెప్పుకొచ్చాడు. ధోని నిర్ణయానికి గౌరవించాము అంటూ తెలిపాడు. మిస్టర్ కూల్ ఏం చేసినా అది జట్టుకు మేలు చేస్తుంది అని మేము నమ్ముతాం. కెప్టెన్ల ఫోటో షూట్ లో ధోని లేకపోవడంతో.. ఆయన సారథిగా తప్పుకున్న నిర్ణయం బయటికి వచ్చింది. అప్పుడే మాకు కూడా తెలిసింది అంటూ కాశీ విశ్వనాథన్ చెప్పుకొచ్చారు. అయితే ఇలా ఫోటోషూట్ లో ధోని లేకపోవడం ఋతురాజ్ కనిపించడం జరిగిన కాసేపటికి.. ఇక రుతురాజ్ ను అఫీషియల్ గా కెప్టెన్ గా అనౌన్స్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: