మహేంద్రసింగ్ ధోని.. ఈ పేరు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికే అందరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన పేరు ఇది. భారత కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని సాధించిన విజయాలు.. ఆటగాడిగా అతను సాధించిన ఘనతలు ప్రేక్షకుల మదిలో ధోనీకి ప్రత్యేకమైన స్థానం ఏర్పడేలా చేశాయి అని చెప్పాలి. అయితే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతూ వస్తున్నాడు ధోని.


 అయితే 2024 ఐపిఎల్ సీజన్ ప్రారంభానికి ముందు మాత్రం ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుని యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కి సారధ్య బాధ్యతలు అప్పగించాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ప్రారంభ వేడుకలు ముగించుకుని.. సరిగ్గా ఎనిమిది గంటలకు ప్రారంభమైంది ఈ సీజన్. అయితే వైడ్ తో  ఈ సీజన్ ప్రారంభం కావడం గమనార్హం. కాగా నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును వారి సొంతమైదానంలోనే ఓడించి ఘన విజయాన్ని అందుకుంది.


 అయితే ధోని ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకొని కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్న నేపథ్యంలో.. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ ప్రచారం జరుగుతోంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది ధోని గురించి ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. అయితే కొంతమంది అభిమానులు ధోని గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ని వైరల్ గా మార్చేస్తూ ఉన్నారు. ఏకంగా పొడవాటి జుట్టుతో ధోని ఐపిఎల్ సీజన్లో బరిలోకి దిగాడు. దీంతో వింటేజ్ లుక్స్ తో అదరగొట్టేసాడు. అయితే కెరియర్ ఆరంభంలో లాంగ్ హెయిర్ తో కనిపించిన ధోని.. కెరియర్ ఎండ్ లోను అదే బ్రాండ్ తో వీడ్కోలు పలికేందుకు రెడీ అవుతున్నాడు అంటూ కొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: