దాదాపు గత 16 సీజన్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న మహేంద్రసింగ్ ధోని.. ఇటీవల జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ధోని 2019లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికినప్పుడే.. ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ పై కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇక ప్రతి సీజన్లోను ధోని కొనసాగుతూనే వస్తున్నాడు. మధ్యలో రవీంద్ర జడేజా కు కెప్టెన్సీ అప్పగించాడు ధోని. ఆ సమయంలో ఇక అదే ధోనికి  చివరి సీజన్ అనుకున్నప్పటికి జడేజా కెప్టెన్సీ విషయంలో పూర్తిగా విఫలమయ్యాడు.


 దీంతో అదే సీజన్లో మళ్ళీ జడేజా కెప్టెన్సీ ని ధోనీకి అప్పగించేసాడు. ఈ క్రమంలోనే ఇక ధోని తర్వాత టీమిండియా కు కెప్టెన్ గా అవ్వబోయేది ఎవరు అనే విషయంపై తీవ్రమైన చర్చ జరిగింది అని చెప్పాలి. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఈ సీజన్లో తనది కొత్త పాత్ర ఉండబోతుంది అంటూ ధోని ఒక ప్రకటన చేయగా.. అందరూ ఇదే విషయంపై చర్చించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా యువ ఆటగాడు రుతురాజు గైక్వాడ్ కు కెప్టెన్సీ అప్పగించాడు మహేంద్రసింగ్ ధోని  ప్రస్తుతం జట్టులో ఆటగాడిగా మాత్రమే కొనసాగుతూ వస్తున్నాడు.


 ప్రస్తుతం ఇదే విషయంపై అందరూ చర్చించుకుంటూ ఉండగా.. ఇక ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం పై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోని పూర్తిగా ఐపీఎల్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించి రుతురాజ్ కు  కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి ఉంటే బాగుండేది అంటూ వ్యాఖ్యానించాడు వసీం జాఫర్. ధోని జట్టులో ఉంటే ఏ కెప్టెన్ కైనా సారథ్యం వహించడం కష్టమవుతుంది. గైక్వాడ్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ధోని దాని అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు కూడా. ధోని పక్కన లేకపోతే రుతురాజ్ జట్టును ఎంతో సులభంగా నడిపించగలడు అంటూ వసీం జాఫర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: