ఐపీఎల్ ప్రారంభమైంది. ఇక ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ పంచుతుంది. ఇక వరుసగా మ్యాచ్లు జరుగుతూ అందరిని టీవీలకు అతుక్కుపోయేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఒక విషయంపై మాత్రం చర్చ అస్సలు ఆగడం లేదు. అదే ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి. ముంబై ఇండియన్స్ జట్టును మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా నిలిపిన రోహిత్ శర్మను ఆ జట్టు యాజమాన్యం అర్ధాంతరంగా సారద్య బాధ్యతల నుంచి తప్పించింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఐదుసార్లు టైటిల్ అందించిన కెప్టెన్ ని తప్పించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. అభిమానులు ఈ విషయాన్ని అసలు జీర్ణించుకోలేకపోయారు. కొత్త కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాలను నియమించింది ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం.


 అయితే ఇన్నాళ్లు కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ జట్టును ముందుకు నడిపించిన రోహిత్ శర్మ.. ఇక ఇప్పుడు జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని ఎలా జీర్ణించుకోగలడు. ఒక సాదాసీదా ఆటగాడిగా జట్టులో ఎలా కొనసాగగలడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. దీంతో ముంబై ఆడే మ్యాచ్లను చూసేందుకు ప్రేక్షకులు అందరూ కూడా ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇదే విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ సురేష్ రైనా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 ఒక్క ముంబై ఇండియన్స్ జట్టుకి రోహిత్ శర్మను కెప్టెన్ గా తొలగిస్తే ఏంటి ఏకంగా ఐపీఎల్లో పాల్గొనే పది జట్లకు రోహిత్ శర్మ కెప్టెన్ అంటూ సురేష్ రైనా చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి. ఈ సీజన్లో ముంబైకి సారధిగా లేనప్పటికీ.. టి20 ప్రపంచ కప్ దృశ్య అన్ని జట్లకు అతడే నాయకుడు అంటూ అభిప్రాయపడ్డాడు రైనా. రోహిత్ శర్మ దేశంలో ఎక్కడికి వెళ్లినా బలమైన అభిమాన సైన్యం ఉంటుంది. రెండు నెలల తర్వాత పది ఐపిఎల్ జట్ల నుంచి ప్రపంచ కప్ కోసం ఆటగాల్లని ఎంచుకోవాలని రోహిత్ కు తెలుసు. అందుకే అతను కెప్టెన్ కాదు అని చెప్పలేం అంటూ రైనా వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl