2024 ఐపిఎల్ సీజన్లో కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఈసారి టైటిల్ గెలుస్తుందా ప్రస్తుతం ఇదే విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇక ఐపీఎల్ సీజన్లో ఒకసారి టైటిల్ విజేతగా కొనసాగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇక అప్పటి నుంచి టైటిల్ పోరులో వెనుక పడుతూనే ఉంది. వార్నర్ కెప్టెన్సీ వదిలేసిన తర్వాత ఎంతోమంది కెప్టెన్లను మార్చుతూ వచ్చింది జట్టు యాజమాన్యం. అయినప్పటికీ ఆ టీం కి మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు.


 అయితే ఇక ఇప్పుడు గత ఏడాది వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాకు టైటిల్ అందించిన ఫ్యాట్ కమిన్స్ ను కెప్టెన్ గా నియమించుకొని బరిలోకి దిగింది సన్రైజర్స్. ఈ క్రమంలోనే అతని సారథ్యంలో తప్పకుండా సన్రైజర్స్ కప్పు గెలిచి తీరుతుంది అంటూ అభిమానులు అందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. అదే సమయంలో కొన్ని పాత సెంటిమెంట్లను కూడా ప్రస్తుతం తెరమీదకి తీసుకువస్తున్నారు అని చెప్పాలి. ఐపిఎల్ హిస్టరీలో హైదరాబాద్ జట్టు ఇప్పుడు వరకు రెండుసార్లు టైటిల్ గెలిచింది. గతంలో దక్కన్ చార్జెస్ గా పేరు ఉన్న సమయంలో ఒకసారి ఇక సన్రైజర్స్ గా పేరు మార్చుకున్న తర్వాత ఒకసారి టైటిల్ విజేతగా నిలిచింది. అయితే ఈ రెండు సార్లు హైదరాబాద్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించింది ఆస్ట్రేలియా ప్లేయర్లే కావడం గమనార్హం.



 2009లో డెక్కన్ చార్జెర్స్ అనే పేరుతో ఇక గిల్ క్రిస్ట్ కెప్టెన్సీలో బరిలోకి దిగింది హైదరాబాద్ జట్టు. ఇక ఆ సమయంలో టైటిల్ విజేతగా నిలిచింది. 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ అనే పేరుతో బరిలోకి దిగి ట్రోఫీని ముద్దాడింది ఈ జట్టు. ఇక ఇప్పుడు హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న ప్యాట్ కమిన్స్ కూడా ఆస్ట్రేలియా ఆటగాడే కావడం గమనార్హం. దీంతో ఇక మరో ఆస్ట్రేలియా కెప్టెన్ సన్రైజర్స్ కు ఐపీఎల్ టైటిల్ అందించడం ఖాయం అంటూ అభిమానులు అందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. మరి ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl