సాధారణంగా క్రికెట్లో మాత్రమే కాదు ఏ క్రీడల్లో అయినా సరే ఎంతటి దిగ్గజ ఆటగాడు అయినా సరే.. ఏదో ఒక సమయంలో తన ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే. ఇక ప్రాణం కంటే ఎక్కువైన ఆటను వీడ్కోలు పలికి వదిలేయాల్సిందే. ఇక ప్రతి ఆటగాడికి కూడా జీవితంలో ఒకసారి ఇలా ఆటకు వీడ్కోలు పలికే సమయం వస్తుంది.  గుండెల్లో కొండంత బాధను పెట్టుకుని ఇష్టమైన ఆటను వదిలేస్తున్నాము అని వీడ్కోలు పలకడం లాంటివి చేస్తూ ఉంటారు ప్లేయర్లు. కానీ ఇటీవల కాలంలో మాత్రం కొంతమంది ప్లేయర్లు ఏకంగా క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. కానీ ఆ తర్వాత కొంతకాలానికి వీడ్కోలు విషయంలో యూటర్న్ తీసుకుంటూ ఉండటం గమనార్హం.


 ఇప్పుడు వరకు ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఇలా రిటైర్మెంట్ ప్రకటించడం ఆ తర్వాత జట్టు అవసరాల నేపథ్యంలో రిటర్మెంట్ వెనక్కి తీసుకొని మళ్ళీ క్రికెట్ ను కొనసాగించడం లాంటివి చేశారు. ఇక ఇప్పుడు న్యూజిలాండ్ ఆల్రౌండర్ కోరే అండర్సన్ సైతం వీడ్కోలు పలకడం విషయంలో యూటర్న్ తీసుకున్నాడు అన్నది తెలుస్తోంది. రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు అతను ప్రకటించాడు. అయితే మళ్లీ న్యూజిలాండ్ జట్టు తరఫున అతను ఆడటం లేదు. ఏకంగా యూఎస్ఏ తరఫున ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికిన కోరే అండర్సన్ ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డాడు.


 అయితే ఆట మీద ఉన్న మక్కువతో అక్కడ దేశవాళి క్రికెట్ లీగ్లలో ఆడుతూ మంచి ఫామ్ కనబరుస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు ఏకంగా యూఎస్ఏ తరఫున ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. ఇక అతనికి అమెరికా నేషనల్ క్రికెట్ టీం లో కూడా ఇటీవల చోటు దక్కింది. కెనడాతో జరగనున్న టీ20 సిరీస్ లకు ఎంపికయ్యాడు కోరే అండర్సన్. అంతేకాదు టి20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో కూడా యూఎస్ఏ జట్టు తరఫున బరిలోకి దిగబోతున్నాడు అని చెప్పాలి. ఇక దీనికోసం ఇటీవల రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు కోరే అండర్సన్.

మరింత సమాచారం తెలుసుకోండి: