రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎప్పటిలాగానే ఐపీఎల్ 17వ సీజన్లో కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. అయితే గత ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో కొంతమంది ఆటగాళ్లను జట్టు నుంచి వదిలేసి కొత్త ప్లేయర్లను టీం లోకి తీసుకుంది. దీంతో పటిష్టంగా కనిపించింది. అయితే అటు లీగ్ మ్యాచ్ లలో మాత్రం సత్తా చాట లేక పోతుంది బెంగుళూరు జట్టు. ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడితే కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. ఇటీవల కోల్కతా తో జరిగిన మ్యాచ్ లో ఓటమి అయితే అభిమానులను మరింత బాధించింది.



 ఎందుకంటే ప్రత్యర్తి ముందు మంచి లక్ష్యాన్ని ఉంచి బరిలోకి దిగిన బెంగుళూరు జట్టు ఎంతో అలవోకక విజయం సాధించడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఇక ఆర్సిబి చెత్త బౌలింగ్ తో చివరికి గెలవాల్సిన మ్యాచ్ ని కూడా చేజార్చుకుంది. అయితే బెంగళూరు జట్టు వారి సొంత మైదానం అయిన చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ఆడినప్పటికీ బెంగళూరు టీం కి మాత్రం  కలిసి రావడం లేదు. ఈ క్రమంలోనే కొన్ని గత గణాంకాలు కూడా ప్రస్తుతం తెరమీదకి వస్తున్నాయి. బెంగళూరు జట్టుకి హోమ్ గ్రౌండ్ లో కోల్కతా జట్టు కొరకరాని కొయ్యగా మారింది అన్నది తెలుస్తుంది.


 ఎందుకంటే ఇటీవల జరిగిన మ్యాచ్లో విజయం సాధించడంతో చిన్న స్వామి స్టేడియంలో కోల్కతా జట్టు తన రికార్డులను నిలబెట్టుకుంది. వరుసగా తొమ్మిదో ఏడాది కూడా బెంగళూరు జట్టు పైనే విజయం సాధించి ఆధిపత్యాన్ని కొనసాగించింది. సొంత మైదానంలో కేకేఆర్ తో జరిగిన ప్రతి మ్యాచ్లో కూడా బెంగళూరు జట్టు ఘోర ఓటమిని మూటగట్టుకుంటూనే ఉంది. 2016 తర్వాత చిన్న స్వామీ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో కోల్కతా టీం కి ఒక్క ఓటమి కూడా ఎదురు కాలేదు. ఒక రకంగా బెంగళూరుకి కాదు కోల్కతా కి చిన్నస్వామి స్టేడియం హోమ్ గ్రౌండ్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl