ఈ ఏడాది ఐపిఎల్ సీజన్ లో కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లో టైటిల్ విజేతగా నిలుస్తుంది అనుకున్న ముంబై జట్టు.. వరుస ఓటమిలతో సతమతమైంది. దీంతో అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. రోహిత్ లాంటి కెప్టెన్ ను తప్పించిన తర్వాత ముంబై ఇండియన్స్ జట్టుకు ఇలాంటి పరిస్థితే వస్తుంది అంటే కొంతమంది ఫ్యాన్స్ విమర్శలు కూడా చేశారు. అయితే ఇటీవల వాంకడే  స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం ఘన విజయాన్ని అందుకొని భోణి కొట్టింది.


 వరుసగా మూడు మ్యాచ్లలో ఓడిపోయి నిరాశ పరిచిన ముంబై ఇండియన్స్ నాలుగో మ్యాచ్లో ఢిల్లీతో జరిగిన పోరులో మాత్రం భారీ తేడాతో విజయం సాధించింది. ఏకంగా ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు.. 234 పరుగులు చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే రోహిత్ శర్మ 49, టిమ్ డేవిడ్ 45, ఇషాన్ కిషన్ 42, హార్థిక్ పాండ్యా 39, షెఫర్డ్ 39 పరుగులతో రాణించారు. ఇలా భారీ టార్గెట్ ను ప్రత్యర్థి ఢిల్లీ ముందు ఉంచగా.. ఆ జట్టు కేవలం 205 పరుగులకు మాత్రమే పరిమితం అయింది. ఢిల్లీతో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించడమే కాదు ఒక అరుదైన రికార్డు కూడా సృష్టించింది.



 ఒక టి20 మ్యాచ్ లో ఆటగాళ్ళు ఎవరు కూడా కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకుండా ఏకంగా అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా ఘనత సాధించింది ముంబై ఇండియన్స్. అయితే ఇటీవల జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ప్లేయర్ లందరూ కూడా హాఫ్ సెంచరీకి చేరువగా వచ్చి ఆగిపోయిన వారే తప్ప ఆ మార్క్ మాత్రం అందుకోలేదు. అయితే గతంలో ఈ రికార్డు సోమర్ సెట్ టీం  పేరిట ఉండేది. ఇంగ్లాండ్ టి20 బ్లాస్ట్ టోర్నీ 2018లో సామర్సెట్ జట్టు టీం లోని ప్లేయర్లు ఎవరు కూడా కనీసం ఒక్క హాఫ్ సెంచరీ  కూడా చేయకుండా 226 పరుగులు చేసింది. ఇటీవల జరిగిన మ్యాచ్లో ఒక అర్థ సెంచరీ  లేకుండా 234 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ ఈ రికార్డును బ్రేక్ చేసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl