ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ కి ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మాత్రం గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఏకంగా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి అతని స్థానంలో హార్దిక్ పాండ్యాకు సారధిగా అవకాశం ఇచ్చింది జట్టు యాజమాన్యం. అయితే గతంలో గుజరాత్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఎంత సూపర్ సక్సెస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో అతని కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ కూడా అద్భుతంగా రాణిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో వరుస ఓటములతో సతమతమైంది.


 వరుసగా మూడు మ్యాచ్లలో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ జట్టు ఇక నాలుగో మ్యాచ్లో ఢిల్లీతో జరిగిన పోరులో మాత్రం విజయం సాధించి బోనీ కొట్టింది అని చెప్పాలి. అయితే ఇక ఐపీఎల్ ప్రారంభం నాటి నుంచి కూడా గాయం కారణంగా ముంబై ఇండియన్స్ జట్టుకి దూరమైన నయా మిస్టర్  360 ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ ఇక ఢిల్లీతో జరిగే మ్యాచ్ కి ముందు జట్టులో చేరిపోయాడు. దీంతో అతను అద్భుతంగా ఆడతాడని అందరూ అనుకుంటే.. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. రెండు బంతులు ఆడి ఒక పరుగు కూడా చేయకుండానే డకౌట్ గా వెనుతిరిగాడు సూర్య కుమార్ యాదవ్.


 ఇక అతని తీరుతో అభిమానులు అందరినీ కూడా తీవ్రంగా నిరాశపరిచాడు అని చెప్పాలి  అయితే ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ డక్ అవుట్ అవ్వడంపై ఒక కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. రెండు రోజుల క్రితం ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన సూర్య బ్యాక్ టు హోమ్ అని ఒక పోస్ట్ పెట్టగా.. దీనికి ఒక నెటిజన్ ఢిల్లీతో మ్యాచ్లో సున్నా కంటే ఎక్కువ పరుగులు చేస్తే నువ్వు గే అంటూ కామెంట్ చేశాడు. కానీ ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ డకౌట్ కావడంతో ఇక ఈ కామెంట్ వైరల్ గా మారిపోయింది. మిస్టర్ 360 ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ గే కాదు అంటూ ఈ కామెంట్ కి రిప్లై ఇస్తున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: