ఐపీఎల్ లో అన్ని టీమ్స్ కంటే ఎక్కువగా.. ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఐపిఎల్ టోర్నీలో ఎప్పుడు కలిసి రాదు. ఇక ఆ జట్టు ప్రతి సీజన్లో కూడా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతూ చివరికి టైటిల్ వేటలో వెనుకబడిపోతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మిగతా టీమ్స్ తో పోల్చి చూస్తే ఆ టీంలో మహా మహా స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ.. ఎందుకో జట్టు ప్రదర్శన తీరు మాత్రం అంతంత మాత్రం గానే ఉంటుంది. దీంతో 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో బెంగళూరు జట్టు అభిమానులందరికీ ఆ టీం టైటిల్ గెలుస్తుంది అన్నది కేవలం కలగానే మిగిలిపోయింది.




 అయితే ఇక ఇప్పుడు 2024 ఐపిఎల్ సీజన్లను ఇదే ఆట తీరును కొనసాగిస్తుంది. ఈ ఏడాది జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ మహిళల టైటిల్ విజేతగా నిలిచింది. ఇదే ఊపులో ఐపీఎల్లో ఆర్సిబి పురుషుల జట్టు కూడా తప్పకుండా టైటిల్ గెలిచి తీరుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఆ జట్టు ప్రదర్శన పూర్తిగా నిరాశనే మిగులుస్తుంది అని చెప్పాలీ. ఇప్పుడు వరకు ఐదు మ్యాచ్లు ఆడిన ఆర్సిబి  కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లకు అండగా నిలబడుతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది.


 ఇలా అనగానే.. ఫామ్ లో లేని ఆటగాళ్లను జట్టులోకి తీసుకొని వారికి మద్దతు ఇస్తుంది అనుకునేరు. ఇతర టీమ్స్ లో ఫామ్ లో లేని ఆటగాళ్లు బాగా పుంజుకునేందుకు ఆర్సిబి ఉపయోగపడుతుంది. ఇదే విషయంపై ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఎందుకంటే తొలి మూడు మ్యాచ్లలో కలిపి కేవలం 35 పరుగులు మాత్రమే చేసిన బట్లర్ ఇటీవల ఆర్సిబి పై శతకం చేసి ఫామ్ లోకి వచ్చాడు. అసలు బ్యాటింగ్ చేయడమే మర్చిపోయిన సునీల్ నరైన్ 22 బంతుల్లోనే 47 పరుగులు చేసాడు. ఫామ్ లో లేని డీకాక్ అయితే 56 బంతుల్లో 81 పరుగులు చేసి బ్యాటింగ్ విధ్వంసం సృష్టించాడు. ఇక యంగ్ బౌలర్ హర్ ప్రీత్ బ్రార్ సైతం ఆర్సీబీతో మ్యాచ్ అంటే పండగే ఇక ఆ జట్టుతో జరిగిన ప్రతి మ్యాచ్ లో మూడు నాలుగు వికెట్లు పడగొడుతూనే ఉన్నాడు. ఇలా ఫాలో లేని ఆటగాల్లకు ఆర్సిబి అండగా నిలుస్తూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb