పాకిస్తాన్ క్రికెట్లో గత కొంతకాలం నుంచి గందరగోల పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగి కనీస పోటీ ఇవ్వలేక మధ్యలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ జట్టు ఇండియా నుంచి స్వదేశానికి చేరుకుందో లేదో బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఏకంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆ జట్టు కోచింగ్ సిబ్బందిని కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కాలంలో సెలెక్టర్లపై కూడా వేటు వేసింది.


 దీంతో ఇక పాకిస్తాన్ క్రికెట్ సంక్షోభంలో పడిపోయింది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో పాక్ క్రికెట్ ను బాగు చేయడం నావల్ల కాదు అంటూ అప్పటి పీసీబీ చైర్మన్ జాకా అశ్రప్ చివరికి ఆ పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇక పాక్ క్రికెట్ మరింత సంక్షోభంలో పడిపోయింది అని చెప్పాలి. అయితే గత కొన్ని రోజుల క్రితమే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త చైర్మన్గా మోహ్సిన్ నఖ్వి బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇలా బాధ్యతలు చేపట్టిన పాక్ క్రికెట్ ను గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలీ. ఈ క్రమంలోనే ఇప్పటికే పాకిస్తాన్ ప్లేయర్ల ఫిట్నెస్ పెంచేందుకు ఆర్మీతో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.



 ఇంకోవైపు కోచింగ్ సిబ్బందిని నియమించడం విషయంలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇలా గత కొంతకాలం నుంచి కోచ్ లేకుండానే వరుసగా  క్రికెట్ ఆడుతున్న పాకిస్తాన్ కు ఇక ఇప్పుడు పాక్ క్రికెట్ బోర్డు కొత్త కోచ్ ను నియమించింది. ఆ జట్టు హెడ్ కోచ్గా పాక్ మాజీ ఆటగాడు అజహర్ మహమ్మద్ ను ఎంపిక చేశారు. ఈనెల 18 నుంచి న్యూజిలాండ్తో జరగబోయే టి20 సిరీస్ కు ఆయన కోచ్ గా పని చేయనున్నాడు. అయితే అజహర్ పాకిస్తాన్ తరఫున 164 మ్యాచ్లు ఆడి 162 వికెట్లు పడగొట్టాడు. గతంలో పాకిస్తాన్కు బౌలింగ్ కోచ్ గా కూడా వ్యవహరించారు. అయితే ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకి కొన్ని మ్యాచ్లలో ప్రాతినిధ్యం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: