ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కాక ముందు నుంచి రోహిత్ శర్మ ఒక విషయంలో వార్తల్లో తెగ హాట్ టాపిక్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా పేరు సంపాదించుకున్న  రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం ఏకంగా అర్ధాంతరంగా కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఇక ఈ నిర్ణయంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగిపోయారు. రోహిత్ లాంటి సారధిని తొలగించడం ఏంటి అని ఇక ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం పై తీవ్ర స్థాయిల విమర్శలు కూడా చేశారు.


 ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్లో కొత్త సారథి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఇక జట్టులో కీలక ఆటగాడిగా మాత్రమే కొనసాగుతూ ఉన్నాడు రోహిత్ శర్మ. అయితే ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మను అవమానించేలా ప్రవర్తిస్తున్నాడు అంటూ విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక ముంబై వరుసగా మ్యాచ్లలో విఫలమవుతున్న నేపథ్యంలో  ఈ విమర్శలు రెట్టింపు అవుతున్నాయ్ అని చెప్పాలి. ఇలాంటి సమయంలో రోహిత్ గురించి మరో కొత్తవార్త తెరమిదికి వచ్చింది. వచ్చే ఏడాది  జరగబోయే ఐపీఎల్ మెగా వేలంలో రోహిత్ ముంబై ఇండియన్స్ ని వదిలేయబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది.


 ఈ క్రమంలోనే ముంబై నుంచి రోహిత్ బయటికి వస్తే.  అతని సొంతం చేసుకునేందుకు మిగతా టీమ్స్ అన్ని కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మరి ముఖ్యంగా లక్నో టీం అటు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ పై కన్నేసింది అన్నది తెలుస్తుంది. మెగా వేలంలో హిట్ మాన్ ను దక్కించుకోవడానికి లక్నో ఫ్రాంచైజీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుందట. ఆయన కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్. ఏకంగా రోహిత్ ను లక్నో జట్టులో చేర్చుకునేందుకు బ్లాంక్ చెక్ ఇచ్చేందుకు కూడా రెడీ అవుతుందట ఆ ఫ్రాంచైజీ .

మరింత సమాచారం తెలుసుకోండి: