గత కొంతకాలం నుంచి భారత జట్టులో కొనసాగుతున్న ఆటగాళ్లందరూ కూడా దేశవాళీ క్రికెట్ ని విస్మరిస్తూ వస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడైనా పాము కోల్పోయి లేదా గాయం బారిన పడినప్పుడు ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడి మళ్లీ ఫామ్ అందుకుని టీమ్ ఇండియాలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు తప్ప.. ఇక దేశవాళీ క్రికెట్ ఆడాలని మాత్రం ఆలోచించడం లేదు. అదే సమయంలో భారత సెలక్టర్లు కూడా ఐపీఎల్ లో ప్రదర్శన ఆధారంగానే జట్టు సెలక్షన్ చేస్తున్నారు అంటూ ఒక అపవాదు కూడా ఏర్పడింది.


 ఈ క్రమంలోనే ఇలాంటి విషయంలో అటు బీసీసీఐ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి అటు దేశవాళి క్రికెట్ ఆడకుండా దూరంగా ఉంటున్న క్రికెటర్ల పై టార్గెట్ చేస్తూ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఫామ్ కోల్పోయి భారత జట్టులో చోటు కోల్పోయిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లకు బిసిసిఐ ఊహించని షాక్ వచ్చింది. దేశవాళి క్రికెట్ ఆడమని ఆదేశించిన ఇద్దరు క్రికెటర్లు డొమెస్టిక్ క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపించకపోవడంతో.. ఇద్దరిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. ఇది కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.


 అయితే ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లను ఇలా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించడానికి వెనుక కారణమేంటి అన్నది ఎన్నో రోజులపాటు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై ఇటీవల బీసీసీఐ సెక్రెటరీ జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇషాన్, అయ్యర్ లను సెంట్రల్ కాంటాక్ట్ నుంచి తొలగించాలని సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్  నిర్ణయించారు. కమిటీ నిర్ణయాలను అమలు చేయడమే తన పని అని తెలిపారు. వరల్డ్ కప్ కి ముందు రంజీల్లో ఆడాలని అయ్యర్, ఇషాన్లకు సూచిస్తే వాళ్లు ఆడక పోవడంతో ఇలా బిసిసిఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించాను. ఇక ఇప్పుడు సంజు లాంటి కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇస్తున్నాం అంటూ జై షా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: