![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/sports/libra_libra/ipl9c8f01d9-dab2-4aaa-afce-c8c47d312d6d-415x250.jpg)
దీంతో అభిమానులు అందరూ కూడా నిరాశ చెందారు. అయితే ఇక ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ తో నేడు రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడబోతుంది. చెన్నైలోనే చపాతి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. దీంతో ఇక సన్‌రైజర్స్ ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనే విషయం పైన అందరి దృష్టి ఉంది ఇక తమ అభిమాన జట్టు తప్పకుండా గెలవాలని అటు తెలుగు క్రికెట్ అభిమానులు అందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు అని చెప్పాలి.
ఇలాంటి సమయంలోనే అటు చపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గత గణాంకాలు ఎలా ఉన్నాయి అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులను ఇక ఇప్పుడు చెపాక్ స్టేడియంలో ఉన్న ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఆందోళనకు గురిచేస్తుంది. ఎందుకంటే రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగుతున్న ఈ స్టేడియంలో. సన్‌రైజర్స్ ఒక చెత్త రికార్డు ఉంది. ఇప్పుడు వరకు ఇక్కడ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 10 మ్యాచ్‌లు ఆడగా.. ఎనిమిదింటిలో కూడా ఓడిపోయింది. ఒక మ్యాచ్ గెలవగా మరో మ్యాచ్ డ్రాగ ముగిసింది. ఇలా ఒక రకంగా చెప్పాలంటే చెపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ కి ఒకసారి కూడా కలిసి రాలేదు. అయితే ఈ సెంటిమెంట్‌ను కమిన్స్ సేన బ్రేక్ చేస్తుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.