సాధారణంగా క్రికెట్ అంటే ఫన్నీ గేమ్ అని చెబుతూ ఉంటారు ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు. ఎందుకంటే క్రికెట్లో కేవలం ఉత్కంఠ మాత్రమే కాదు ఇక ప్రేక్షకులందరికీ కడుపుబ్బా నవ్వించే ఫన్నీ ఘటనలు కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి ఫన్నీ ఘటన ఏదైనా జరిగింది అంటే ఇక అది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇంకొన్నిసార్లు ఏకంగా క్రికెట్ రూల్స్ ని అందరికీ గుర్తుచేసే ఘటనలు కూడా అప్పుడప్పుడు ఉత్కంఠ భరితంగా జరుగుతున్న మ్యాచ్ లో చోటు చేసుకుంటూ ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే.


 సాధారణంగా బ్యాటింగ్ చేస్తున్న ఒక ఆటగాడు బంతిని షాట్ ఆడబోయి ఇక వికెట్లకు తాకాడు అంటే అది ఔట్ గా పరిగణిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక హిట్ వికెట్ గా సదరు బ్యాట్స్మెన్ పెవిలియన్ చేరాల్సి  ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం బ్యాట్స్మెన్ ఇలా హిట్ వికెట్ అయినప్పటికీ అంపైర్ అవుట్ ప్రకటించలేదు  ఎందుకంటే అది నోబాల్. అయితే అదే బంతికి అతను రన్ తీసేందుకు ప్రయత్నించి చివరికి రన్ అవుట్ కూడా అయ్యాడు  అయినప్పటికీ అటు ఎంపైర్ ఔట్ గా ప్రకటించలేదు. అదేంటి నోబా ల్  సమయంలో రన్ అవుట్ అయితే ఔట్ గా ప్రకటిస్తారు కదా అని అంటారా    అయితే క్రికెట్ రూల్స్ ప్రకారం ఇలా ఒకే బంతికి రెండుసార్లు ఔట్ అయినా నాటౌట్ గా నిలిచాడు సదరు ఆటగాడు.


 టి20 బ్లాస్ట్ లో భాగంగా యార్క్ షైర్ బ్యాటర్ మసూద్ ఒకే బంతికి రెండు సార్లు అవుట్ అయ్యాడు  కానీ ఎంపైర్ మాత్రం అతని నాటౌట్ గానే ప్రకటించాడు  లంకా షేర్ బౌలర్ బ్లాతర్విక్ వేసిన బంతిని మసూద్ ఎదుర్కోగా.. అతని కాళ్లు స్టంప్స్ ని తాకాయి. దీంతో హిట్ వికెట్ అయ్యాడు. అయితే నో బాల్ కావడంతో బ్రతికిపోయాడు. కాగా అదే బంతికి రన్ అవుట్ కాగా.. అంపైర్ నాట్ అవుట్ ఇచ్చాడు. ఎందుకంటే రూల్ 31.7 ప్రకారం బ్యాటర్ తాను ఔట్ అయ్యాను అని అనుకుని ఇక వికెట్ను వదిలేసుకుంటే దానిని నాటౌట్ గా పరిగణిస్తారు. అయితే తాను హిట్ వికెట్ అయ్యాను అని అనుకొని మసూద్ రన్ కోసం సరిగా ప్రయత్నించలేదు. దీంతో రన్ అవుట్ అయ్యాడు అందుకే అతన్ని ఇక నాటౌట్ గానే ప్రకటించాడు అంపైర్  .

మరింత సమాచారం తెలుసుకోండి: