పారిస్ ఒలింపిక్స్ 2024 ముగింపు వేడుకల సందర్భంగా భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, మహిళా షూటర్ మనూ భాకర్ మాట్లాడుకున్నటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మనూభాకర్, నీరజ్ చోప్రా చాలా సన్నిహితంగా ఉన్నట్లు నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా తామిద్దరిని ఫోటో తీస్తున్న తన తల్లి సుమేదను మనూభాకర్ వద్దని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.


తర్వాత నీరజ్ చోప్రాతో ప్రత్యేకంగా మాట్లాడిన సుమేద.... అతనితో తలపై ఒట్టు వేయించుకున్నారు. అయితే ఈ ఇద్దరినీ ఫోటో తీస్తుంటే మనూభాకర్ ఎందుకు వద్దన్నారు....? నీరజ్ చోప్రాతో సుమేద ఏం మాట్లాడారు? ఎందుకు ఒట్టు వేయించుకున్నారు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వీడియో చూస్తుంటే.... మనూభాకర్, నీరజ్ చోప్రాకు ఇంతకు ముందు నుంచే పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ ఇద్దరు మంచి స్నేహితులా? లేకపోతే రిలేషన్ కొనసాగిస్తున్నారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. నెటిజెన్లు మాత్రం మనూభాకర్ నీరజ్ చోప్రా పెళ్లి ఎప్పుడు...? అని ప్రశ్నిస్తున్నారు. మను బాకర్ తల్లి సుమేధ.... నీరజ్ చోప్రా తో మాట్లాడినటువంటి మాటలు కూడా ఈ సందేహాలకు బలం చేకూర్చుతున్నాయి. తన కూతురిని పెళ్లి చేసుకోవాలని నీరజ్ చోప్రాను సుమేద కోరినట్లు నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.


పారిస్ ఒలింపిక్స్ 2024లో నీరజ్ చోప్రా రజత పథకం గెలుచుకోగా.... పాకిస్తాన్ బళ్లెం వీరుడు అర్షద్ నదీమ్ బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరిన నదీమ్....ఒలింపిక్స్ లో సరికొత్త రికార్డును నమోదు చేశాడు. దీంతో నీరజ్ చోప్రా  కు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. నీరజ్ చోప్రా  కంటే.. ఎక్కువగా బల్లెం విసిరిన పాక్‌ అథ్లెంట్‌ నదీమ్‌ కు గోల్డ్‌ మెడల్‌ రావడం జరిగింది. ఇటు నీరజ్ చోప్రా కు సిల్వర్‌ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: