అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా మీరు విన్నది నిజమే. ఓకే ఫామిలీ నుంచి ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు క్రికెటర్లు తయారయ్యారు. తన కుటుంబం నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్న నాలుగో వ్యక్తిగా "బెన్ కరన్" రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంగ్లండ్ జట్టులో స్టార్ ప్లేయర్లు అయిన సామ్ కరన్ - టామ్ కరన్ సోదరుడే ఈ బెన్ కరన్ అనే వ్యక్తి. అయితే, తన బ్రదర్స్‌లా ఇంగ్లండ్‌కు కాకుండా బెన్ జింబాబ్వే తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టనున్నాడనే విషయాన్ని అంతర్జాతీయ మీడియాలు ప్రచురించాయి.
 
విషయం ఏమిటంటే... అఫ్గానిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు బెన్ జింబాబ్వే జట్టుకు ఎంపిక అయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి. బెన్ కరన్ తండ్రి కెవిన్ కరన్ జింబాబ్వే తరఫున ప్రాతినిథ్యం వహించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. 11 వన్డేలు ఆడిన కెవిన్ 287 పరుగులు, 9 వికెట్లు ఆడాడు. కాగా, తండ్రి కెవిన్ కరన్ అడుగుజాడల్లో నడిచి ముగ్గురు కుమారులు ప్రొఫెషనల్ క్రికెటర్లుగా ఎదగడం చాలా అరుదైన విషయంగానే చెప్పుకోవచ్చు. ఇక 28 ఏళ్ల బెన్ కరన్ విషయానికొస్తే... ఇతను ఎడమచేతి వాటం టాప్ ఆర్డర్ బ్యాటర్. కుడిచేతితో ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు అంటూ కధనాలు వెలువడుతున్నాయి.

మొత్తం 45 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 34.70 సగటుతో బెన్ 2429 పరుగులు చేశాడు. 36 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 999 పరుగులు చేశాడు. కాగా, జింబాబ్వే పర్యటనలో అఫ్గానిస్థాన్ 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. అయితే, అఫ్గాన్ టీ20 సిరీస్‌కు ప్రకటించిన జింబాబ్వే జట్టులో మాత్రం బెన్ కరన్‌కు స్థానం దక్కలేదు. వన్డే సిరీస్‌కు మాత్రమే సెలక్ట్ కావడం గమనార్హం. దేశవాళీలో రాణిస్తున్న బెన్ కరన్ 50 ఓవర్ల ఫార్మాట్‌లో అవకాశం దక్కించుకున్నాడు. రేపటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుందనే విషయం అందరికీ తెలిసినదే. జింబాబ్వే టీ20 జట్టు లిస్ట్ చూస్తే...  సికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ఫరాజ్ అక్రమ్, ర్యాన్ బర్ల్, టకుద్జ్వానాషే కైటానో, ట్రెవర్ గ్వాండు, వెస్లీ మాధేవెరే, తడివానాషే మరుమని, టినోటెండా మపోసా, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజారబాని, తషింగా ముసెకివా, డియోన్ మైయర్స్, రిచర్డ్ నగరవ, న్యూమాన్ తదితరులు గలరు.

జింబాబ్వే వన్డే జట్టు: క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, బెన్ కరన్, జాయ్‌లార్డ్ గుంబీ, ట్రెవర్ గ్వాండు, టినోటెండా మపోసా, తడివానాషే మరుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజారబాని, డియోన్ మైయర్స్, రిచర్డ్ న‌గరవ, న్యూమన్, విక్టర్ న్యౌచి, సికిందర్ రజా, సీన్ విలియమ్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: