రెండు తెలుగు రాష్ట్రాల్లోని  క్రికెట్ అభిమానులంతా ఎస్ఆర్ హెచ్  ఎలాగైనా ప్లే ఆఫ్స్ కి వెళ్లాలని బలంగా కోరుకుంటున్నారు. కానీ ఎస్ఆర్ హెచ్ టీం మాత్రం అభిమానుల ఆశలను అడియాశలు చేస్తూ  ప్రతి మ్యాచ్ లో వెనకంజే వేస్తోందని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో జరిగిన మ్యాచుల్లో వరుస బెట్టి  ఒక్కొక్క టీం తొలగిపోతుంది. ముందుగా చెన్నై సూపర్ కింగ్ ఐపీఎల్ నుంచి వైదలిగిపోయింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ మూటసర్దేసుకుంది. తాజాగా ఈ జాబితాలో సన్ రైజర్స్ హైదరాబాద్ చేరబోతోంది. మంచి ఆటగాళ్లు, అద్భుతమైన ప్రోత్సాహం ఉన్నా కానీ ఆటతీరులో మాత్రం ఫెయిల్ అవుతూ వస్తున్నారు. మరి సన్రైజర్స్ హైదరాబాద్ కు ప్లే అప్స్ వెళ్లడానికి ఒక్క ఛాన్స్ కూడా లేదా అంటే గాలిలో పెట్టిన దీపం లాగా ఒక్క ఛాన్స్ అయితే ఉంది. ఆ అద్భుతం జరిగితే మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్  గట్టెక్కినట్టే అంటున్నారు. అవేంటో చూద్దాం.. 

మే రెండవ తేదీన గుజరాత్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఐపీఎల్ 2025 సన్రైజర్స్ హైదరాబాద్ అనధికారంగా నిష్క్రమించినట్టే అనుకోవాలి.. ఇప్పటివరకు పది మ్యాచ్ లు ఆడిన సన్రైజర్స్  కేవలం 3 మ్యాచ్ లు మాత్రమే గెలిచింది. ఇక రాబోయే నాలుగు మ్యాచ్ ల్లో తప్పనిసరిగా ఈ టీం గెలిస్తే  అప్పుడు ఏడు విజయాలతో 14పాయింట్లకు  చేరుతుంది. టోర్నీలో కూడా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుని, 14పాయింట్స్ తో నిలిచిన జట్లకు ఒకదానికి ప్లే ఆప్స్ ఛాన్స్ దొరికే అవకాశం ఉంటుంది. అవకాశం సన్రైజర్స్ హైదరాబాద్ కు రావాలి అంటే, మిగిలిన మ్యాచ్ లు అన్నింటితో సన్రైజర్స్ గెలవడమే కాకుండా  అన్నింట్లోనూ భారీ స్కోరు చేయాలి. ప్రతి మ్యాచ్ లో 50 నుంచి 100 పరుగుల తేడాతో విజయం సాధించాలి. ప్రస్తుతం 13 పాయింట్లతో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు జరిగే ప్రతి మ్యాచ్ లో ఓడిపోవాలి.

ఇప్పటికే 14 పాయింట్లతో ఉన్న గుజరాత్ టైటాన్స్ కూడా  ఆడే ప్రతి మ్యాచ్ లో భారీ తేడాతో ఓడిపోవాలి. ఇక కోల్ కత్తా నైట్ రైడర్ జట్టు మిగిలి ఉన్న నాలుగు మ్యాచ్ల్ ల్లో కనీసం రెండు అయినా ఓడిపోవాలి. అప్పుడు ముంబై ఇండియన్స్ రాయల్ చాలెంజర్స్  బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్ టీమ్స్  టాప్ 3లో నిలుస్తాయి.  ఇక నాలుగవ స్థానం కోసం గుజరాత్, లక్నో, సన్ రైజర్స్  ఈ మూడు టీములు 14 పాయింట్స్ తో సమానంగా ఉండి  పోటీ పడతాయి. ఈ విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కు అన్నీ కలిసి వస్తే  ప్లే ఆప్స్ లో ఛాన్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే  ఒక అద్భుతమే జరగాలి.. మరి చూడాలి సన్ రైజర్స్ హైదరాబాద్ అదృష్టం ఏ విధంగా ఉందో ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: