ఇక డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత అనేక రిస్కులు అనేవి ఉంటాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ప్రతీ ఒక్కరికీ కూడా ఇప్పుడు గూగుల్ అకౌంట్ (Google Account) అనేది తప్పనిసరిగా కావాల్సిందే.ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్ యూజ్ చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్ యాక్సెస్ అనేది ఖచ్చితంగా కావాలి. ఈ యాక్సెస్ కావాలంటే గూగుల్ అకౌంట్ అనేది ఉండాలి. గూగుల్ అకౌంట్‌లో జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫోటోస్ ఇంకా అలాగే యూట్యూబ్ లాంటి అనేక గూగుల్ సర్వీసెస్ పొందొచ్చు. ఇక అంతేకాదు... ఈ అకౌంట్‌తో ఇతర సైట్లలో కూడా లాగిన్ కావొచ్చు. ఇలా ప్రతీ చోటా గూగుల్ అకౌంట్ ని వాడుతుంటారు కాబట్టి రిస్క్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. గూగుల్ అకౌంట్ హ్యాక్ అయ్యే పరిస్థితి కూడా అప్పుడు ఉంటుంది. మరి మీ గూగుల్ అకౌంట్ హ్యాక్ అయిందా? లేదా హ్యాక్ అయిన విషయం ఎలా తెలుసుకోవచ్చు? ఇక ఈ స్టెప్స్ ని కనుక ఫాలో అయితే మీ అకౌంట్ హ్యాక్ అయిందో లేదో తెలుస్తుంది.


ఇక మీ అకౌంట్ హ్యాక్ అయ్యిందో లేదో ఈ సింపుల్ స్టెప్స్ తో తెలుసుకోవచ్చు..

Step 1- ముందుగా మీ గూగుల్ అకౌంట్‌లో లాగిన్ అవ్వాలి.
Step 2- ఎడమవైపు ఉన్న ఆప్షన్స్‌లో Security అనే ఆప్షన్ సెలక్ట్ చేయండి.
Step 3- అందులో review security events పైన క్లిక్ చేయండి.
Step 4- మీ గూగుల్ అకౌంట్ ఎక్కడెక్కడ ఉపయోగించారో వివరాలు అనేవి కనిపిస్తాయి.
Step 5- ఆ వివరాలన్నీ కూడా చెక్ చేయండి. మీరే ఆ యాక్టివిటీస్ చేశారో లేదో చూడండి.
Step 6- ఏదైనా అనుమానం ఉంటే No, it wasn't me అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step 7- ఇక మీ ప్రమేయం లేకుండా మీ గూగుల్ అకౌంట్ వాడినట్టు కనిపిస్తే మీ అకౌంట్ అనేది హ్యాక్ అయినట్టే.


కాబట్టి ఇలా చేసి ఈ సింపుల్ స్టెప్స్ తో మీ గూగుల్ అకౌంట్ హ్యాక్ అయ్యిందో లేదో సింపుల్ గా తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: