బిగ్ బాస్ హౌస్ లో ఏడో వారం సమంత సందడి తో మొదలైన ప్రయాణం సరదాగా సాగుతూ చివరికి మరొక ఇంటి సభ్యురాలి ఎలిమినేషన్ తో ఎపిసోడ్ ముగిసింది. ఈ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియలో లాస్య మరియు దివి మధ్య చర్చ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. కొంత సేపు డిస్కషన్ తరువాత, ఇకనైనా వారిరువురి మధ్య మనస్పర్థలు తొలగిపోవాలని .. లాస్య కోసం దివి స్వయంగా నామినేట్ చేసుకొన్నారు.