తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ దాదాపు చివరి అంకానికి చేరుకుంది... ఇప్పటికే పలువురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కాగా చివరికి.. అభిజిత్, లాస్య, అవినాష్, అరియానా, సోహెల్, అఖిల్, హారిక మరియు మోనాల్ లు మిగిలారు... ఇక ఇప్పుడు టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు అన్న చర్చ బిగ్ బాస్ ఇంటిలో మొదలైంది. ఎవరికి వారు తాము టాప్ ఫైవ్ లో ఉంటాము అని ప్రశ్నించుకుంటూ కొన్ని సందర్భాల్లో ఇతర కంటెస్టెంట్ ల అభిప్రాయాలను అడుగుతున్నారు.