ఈ నలుగురు విజేతలు కూడా ఇంచుమించు ఒకే రకమైన మనస్తత్వం కలవారని చెప్పొచ్చు.... టాస్క్ అయినా లేదా ఏదైనా పర్ఫామెన్స్ అయినా వారికి నచ్చితే తప్పితే లేదంటే చేయరు. మొదటి నుంచి చివరి వరకు ఎక్కువగా వారు వారిలానే ఉన్నారు. లేనిపోని ఎమోషన్స్ కు తావు ఇవ్వలేదు. వారికి నచ్చిన వారితోనే స్నేహంగా ఉండడం.... నచ్చని వారికి దూరంగా ఉండడం, మనసు కు అనిపించింది కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం వీరి సహజ శైలి.