అయితే ఒకప్పుడు ఢీ షో జడ్జ్‌లు ఓ లెవెల్ ఉండేది. ఇప్పుడు అందులోనూ కామెడీ, సెటైర్లు వచ్చేశాయి. ఇక పూర్ణ, ప్రియమణి, శేఖర్ మాస్టర్, యానీ మాస్టర్, బాబా మాస్టర్ ఇలా జడ్జ్‌లందరూ ఎంటర్టైన్మెంట్ లెవెల్‌ను పెంచుతున్నారు. వీరు కూడా స్టేజ్ ఎక్కి పర్ఫామెన్స్, స్కిట్స్ చేస్తూ కామెడీ చేస్తున్నారు. అంతేకాదు ఢీ షోలో గతంలో ఓ సారి ప్రదీప్ పూర్ణ ట్రాక్‌పై ఓ పర్ఫామెన్స్‌ను చేశారు. అది చూసిన పూర్ణ.. ప్రదీప్ అంటే క్రష్ అంటూ మనసులో మాట బయటకు చెప్పేసింది ఆమె. ఇక ఆపై స్టేజ్ మీదకు వచ్చి ప్రదీప్‌ను మెప్పించడానికి పూర్ణ వేసిన స్టెప్పులు, ఇద్దరూ కలిసి పండించిన రొమాన్స్ ఓ రేంజ్‌లో వైరల్ అయిందని తెలిపింది.
ఇక ఢీ షోలో డ్యాన్సులు ఎంతగా ఉంటాయో కామెడీ స్కిట్స్ అన్ని ఉన్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే వారం ఎపిసోడ్‌లో ప్రదీప్ పూర్ణ భార్యభర్తలుగా స్కిట్ వేసినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో పూర్ణ నిజంగానే జీవించేసినట్టు అనిపిస్తోంది. ఇక పూర్ణ ఏవండి కాఫీ కావాలా? ఏం వండమంటారు? అంటూ ప్రదీప్‌పై ప్రేమను కురిపించింది. అంతేకాదు ప్రదీప్, పూర్ణలను సుధీర్, ఆది ఆంటీ, అంకుల్ అని పిలిచారు. దీంతో ప్రదీప్ వారిద్దరిపై కౌంటర్లు వేశాడు. ఇక మొత్తానికి ఈ స్కిట్ ద్వారా మళ్లీ పూర్ణ ప్రదీప్ వార్తల్లో నిలిచారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి