బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.. వీక్షకులకు మాంచి కిక్కు ఇచ్చే గేమ్ షో...ఎందుకంటే ఇప్పుడు షో అలా మారింది.. మొదట పసలేదు అనే డైలాగు ప్రేక్షకుల నుంచి రావడంతో ఇప్పుడు ఓ రేంజులో చేస్తున్నారు.. వద్దు రా బాబు చూడలేకున్నాం అని ప్రేక్షకులు అంటున్నా కూడా ఆగడం లేదు. వెలుతురు ఉంటే నువ్వా నేనా.. చీకటి పడితే నీకు నేను .. నాకు నువ్వు అని హౌస్ మేట్స్ తాపాన్ని తీర్చుకుంటున్నారు.. షో రేటింగ్ బాగా పెరగడంతో మా యాజమాన్యం కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది.. మొత్తానికి ఎటూ చూసిన కూడా రొమాన్స్ ఎక్కువైంది.. ఎంట్టైన్మెంట్ తక్కువయిందనే టాక్ ను అందుకుంది.



చాలా సార్లు హోస్ట్ నాగార్జున చెప్పినా కూడా ఇంటి సభ్యులు వినడం లేదు.. దున్నపోతు మీద వాన కురిసినట్లే ప్రవర్తిస్తున్నారు. ఈ షో ప్రసారమయ్యి ఏడు వారాలు పూర్తి చేసుకోబోతోంది.. ఆరు ఎలిమినేషన్స్ పూర్తి చేసుకుంది. ఇటీవల ఏడో ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. ఇది ఇలా ఉండగా ఇప్పుడు కెప్టెన్సీ కోసం ఇంటి సభ్యులు పోటీ పడ్డారు. అయితే చివరికి కెప్టెన్ గా అవినాష్ ఎన్నికయ్యారు. అరియానా, అవినాష్‌కు కెప్టెన్సీ టాస్క్ కింద ‘బండి తోయరా బాబు’ అనే పోటీ పెట్టారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో భాగంగా కెప్టెన్సీ పోటీదారులు ఇద్దరికీ గార్డెన్ ఏరియాలో చెరో స్టేషన్‌తో పాటు రెండు ట్రాలీలు ఇచ్చారు.



టాస్క్ పూర్తయ్యే లోపు ఎవరు ఎక్కువ మందిని తమ ట్రాలీ లో ఎక్కించుకొని స్టేషన్ వరకు తీసుకెళ్తారో వారే విజేత అవుతారు. మొదట ఇద్దరు విజేతగా నిలిచిన ఇద్దరికి బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చింది.. అవత ఉన్న వాళ్ళని ఇవతల స్టేషన్ కు ఎక్కించుకు రావాలి.. అయితే మోనాల్ అవినాష్ వైపు మొగ్గు చూపడంతో అవినాష్ విజేతగా గెలిచాడు. కెప్టెన్ అయ్యాడు. ఈ వారం మరో ఎలిమినేషన్ అయ్యేవరకు అవినాష్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే అఖిల్ ను మోనాల్ పక్కన పెట్టేసి అవినాష్ కు దగ్గరవుతుంది.. ఈ వారం ఇంటి నుంచి బయటకు మోనాల్ వెళ్తుందని 90 శాతం మంది అంటున్నారు.. ఏమౌంతుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: