దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు దిగ్విజయంగా కొనసాగుతున్న జబర్దస్త్ కిర్రాక్ కామెడీ షో ఎంతో మంది చిన్నాచితకా హాస్యనటులకు మంచి భవిష్యత్తును అందించిందని అనటంలో ఏలాంటి సందేహం లేదు. కానీ మహాసముద్రం లాంటి జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వస్తే ఎంతటి స్టార్ కమెడియన్ పరిస్థితి అయినా అదోగతి పాలవుతుంది. ఐతే మెగా బ్రదర్ నాగబాబు కారణంగా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన చాలామంది స్టార్ కమెడియన్ల పరిస్థితి ప్రస్తుతం దారుణంగా మారింది. తక్కువ హైట్ ఉండే నెమలి రాజా కూడా జబర్దస్త్ షో నుంచి బయటికి వచ్చి పెద్ద తప్పు చేసానని ఏడుస్తున్నాడు. కానీ ఒకసారి తప్పు చేస్తే ఈటీవీ యాజమాన్యం మళ్లీ కరుణించే ప్రసక్తే ఉండదు. అందుకే నెమలి రాజా మళ్లీ జబర్దస్త్ కార్యక్రమం లోకి వెళ్లాలని ప్రయత్నించాడు కానీ అది సాధ్యపడలేదు.

అయితే ఇతనితో పాటు ధనరాజ్, వండర్స్ వేణు, ఆర్పీ, చమ్మక్ చంద్ర తదితరులు జబర్దస్త్ ని వదిలి అదిరింది షో కి షిఫ్ట్ అయ్యారు. కానీ అదిరింది షో కొంతకాలం పాటు సాగి మూతపడింది. ఆ తర్వాత బొమ్మ అదిరింది పేరిట మరొక కామెడీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కానీ అది కూడా ఎంతో కాలం కొనసాగలేదు. దీనితో నాగబాబు ని నమ్ముకుని బయటికి వచ్చిన జబర్దస్త్ కమెడియన్స్ భవిష్యత్తు అయోమయంలో పడిపోయింది. ముఖ్యంగా చమ్మక్ చంద్ర బాగా నష్టపోయారని చెప్పుకోవచ్చు. నిజానికి చమ్మక్ చంద్ర చాలా టాలెంటెడ్.


కష్టపడే మనస్తత్వం ఉన్న చమ్మక్ చంద్ర మంచి స్క్రిప్ట్ రాసుకుని దానిని అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగలరు. ఆయన చేసే ఫ్యామిలీ స్కిట్టులకు సెలబ్రిటీల్లో కూడా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ఆయన జబర్దస్త్ వేదికగా కామెడీ పండించినంత కాలం పాపులారిటీ పెరుగుతూ పోతూనే ఉంది కానీ ఎప్పుడైతే జబర్దస్త్ వీడారో ఆ క్షణం నుంచి ఆయన క్రేజ్ విపరీతంగా తగ్గిపోయింది. నిజానికి జబర్దస్త్ కార్యక్రమం నుంచి వెళ్లిపోయేటప్పుడు రోజా చమ్మక్ చంద్ర ను కలిసి.. ఈ విషయంలో ఒకటికి రెండుసార్లు పునరాలోచించి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సూచించారట. కానీ చమ్మక్ చంద్ర మాత్రం నాగబాబు మాటలను విని తన కెరీర్ ని సర్వ నాశనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: