ఈ టీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో అలాగే ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో లకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు సింగర్ మనో. మనో మెగా హీరో నాగబాబు కు రీప్లేస్ మెంట్ గా వచ్చి జడ్జి గా వ్యవహరిస్తున్నారు. ఇక సహ జడ్జి సీనియర్ నటి అలాగే ఎమ్మెల్యే అయిన  రోజా జడ్జీగా వ్యవహరిస్తూ ఈ షో కు  మంచి టీఆర్పీ రేటింగ్ కూడా తీసుకువస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ షో ద్వారా సింగర్ మనో  దాదాపుగా ఒక షో కు 12 లక్షల రూపాయల రెమ్యునరేషన్ కింద తీసుకుంటున్నారని సమాచారం..


ఇక సింగర్ మనో ప్రసిద్ధిచెందిన గాయకుడు మాత్రమే కాదు సూపర్ స్టార్ రజినీకాంత్ కు డబ్బింగ్ కళాకారుడు కూడా. అంతే కాదు మరి కొంతమంది స్టార్ హీరోలకు డబ్బింగ్ చెప్పేవారు. తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో సుమారు 25 వేలకు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారు. మనో 1985 సంవత్సరంలో తన 19 ఏళ్ల వయసులోని సాంప్రదాయ ముస్లిం పద్ధతిలో జమీలా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆరోజు సింగర్ మనం జీవితంలో మరుపురాని సన్నివేశం.. అలా ఎందుకు అంటే వీరి వివాహానికి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు అలాగే ఈయన గురువు కే. చక్రవర్తి గారు వచ్చి సాక్షి సంతకాలు కూడా చేశారు.

వీరికి ముగ్గురు పిల్లలు.. ఇద్దరు కొడుకులు ,ఒక కూతురు. ఇక ఈయన పెద్ద కొడుకు షకీర్  తమిళ సినిమాలలో కొన్ని పాత్రలు చేస్తుండగా, చిన్న కుమారుడు రతేష్ సినిమాల్లోకి రావాలని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వీరి కూతురు సోఫియాకి కూడా పాడటం అంటే చాలా ఆసక్తి . ఇక ఇప్పటికే ఈమె అమెరికాలో నిర్వహించిన స్వరాభిషేకం కార్యక్రమం లో కూడా పాటలు పాడింది.

ఇలా ఉండగా ఆయన ఆస్తుల వివరాల విషయానికి వస్తే, కేవలం సినీ ఇండస్ట్రీలో పాటలు పాడటమే కాదు.. ఇక బిజినెస్ రంగంలో కూడా తన సత్తా ఏంటో చూపిస్తున్నారు మనో. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ అత్యధిక లావాదేవీలను కూడా జరుపుతున్నారు. ఈయన ఆస్తి దాదాపు 500 కోట్ల రూపాయలు ఉంటుందని సినీ ఇండస్ట్రీ ప్రముఖులు చెబుతున్నారు. ఒకవైపు సినిమారంగం, మరోవైపు రియల్ ఎస్టేట్ రంగం సింగర్ మనో కు బాగా కలిసొచ్చింది అని చెప్పవచ్చు .


మరింత సమాచారం తెలుసుకోండి: