శనివారం, ఆదివారాలు వచ్చాయంటే బిగ్ బాస్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ప్లస్సు. ఎందుకంటే నాగ్ స్టేజ్ పై కనిపించి సందడి చేసే రోజులివి. అంతేకాదు కంటి స్టెంట్ల తప్పులను కౌంట్ చేసి రఫ్ ఆడించే రోజు. ఈ వారం  హౌస్ లో జరిగిన గొడవలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఉమా దేవి బూతుల బాంబులు మామూలుగా పేల్చ లేదు, మరో వైపు సిరి ఓ టాస్క్ సమయంలో తనతో అసభ్యంగా బిహేవ్ చేశాడంటూ సన్ని క్యారక్టర్ నే తప్పు పట్టింది, అటు శ్వేత నామినేషన్ టైంలో హమీదా ముఖంపై కొట్టినట్టు రంగు పూయడం మరీ దారుణం అంతే కాదు. లోబోని కూడా అలాగే ట్రీట్ చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటికీ  లెక్క తేల్చేశారు నాగ్. 

అలాగే టాస్క్ లో బాగా ఆడిన వారిని ప్రశంసించారు కూడా. ఇక శనివారం బిగ్ బాస్ ఎపిసోడ్ లో బిగ్గెస్ట్ విషయానికొస్తే ఉమాదేవితో అక్కినేని నాగార్జున గుంజిళ్ళు తీయించడం అనే చెప్పాలి. ఇంట్లో బూతులు మాట్లాడి అసభ్య పదజాలం వాడినందుకు గాను, ఇతరులను తన మాటలతో బాధపెట్టినందుకు నిలబెట్టి మరి క్లాస్ పీకారు నాగ్. అందుకు ఉమా దేవి సారీ సార్ అంటూ ఎమోషనల్ అయింది. యాని మాస్టర్ ను అసభ్య పదజాలంతో దూషించినందుకు గాను సారీ చెప్పింది. అయినా శాంతించలేదు నాగ్. నువ్వు చేసిన పనికి ఇది సరిపోదమ్మ  ప్రేక్షకులకు సారీ చెప్పి మూడు గుంజిళ్ళు తియ్యి  అంటూ ఆర్డర్ వేశారు. దాంతో ఉమా దేవి బిగ్ బాస్ ఇంటి సభ్యులకు మరియు ప్రేక్షకులకు సారీ చెబుతూ మూడు గుంజీలు తీసింది.

ఇక సిరి ... టాస్క్ సమయంలో సన్ని పిల్లో కోసం సన్ని తన టీ షర్ట్ లోపల చెయ్యి పెట్టాడంటు చేసిన ఆరోపణకి వీడియో చూపించి మరి సిరికి క్లాస్ ఇచ్చారు నాగ్.  ఆ వీడియోల ఏముందంటే సిరిన్ టీ షర్ట్ లో నుండి పిల్లో తీసింది శ్వేత అని క్లియర్ గా కనిపించింది ...కానీ అప్పుడు సిరి ఏమో ఆ పని చేసింది సన్నీనే అంటూ హౌజ్ లో నానా రభస చేసింది. కాబట్టి అలా పూర్తిగా తెలియకుండా ఒకరి క్యారెక్టర్ పై నిందలు వేయకూడదు అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. సిరి ..సన్నికి సారి కూడా చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: