శనివారం ఎపిసోడ్ లో అటు హౌస్ ఇటు బిగ్ బాస్ స్టేజ్ అంతా నాగ్ ఫైర్ తో వేడెక్కిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం మాత్రం ఎంతో ప్రశాంతంగా కూల్ గా చిల్ చిల్ గా కనిపించారు నాగార్జున. ఇంటి సభ్యులతో కూడా చాలా సరదాగా చిన్న చిన్న టాస్క్ లు ఇచ్చి నవ్వించారు. మధ్య మధ్యలో పంచ్ లు వేస్తూ చాలా సరదాగా గడిచిపోయింది ఎపిసోడ్. ఇంటి సభ్యులు చీటీలు ప్రకారం జోడిని ఎంచుకుంటూ డాన్స్ వేసి నాగ్ దగ్గర మార్కులు కొట్టేశారు. ఇక్కడ అనూహ్యంగా హమీద తీసిన చీటీలో శ్రీ రామ చంద్ర పేరు రాగా ఆ అమ్మాయి సంతోషం అంతా ఇంతా కాదు. హౌస్ టాప్ లేచి పోయేలా హేయ్ అంటూ తెగ చిందులు వేసేసింది. పబ్లిక్ గానే శ్రీ రామ చంద్రపై తన ప్రేమను వలకబోస్తోంది. ప్రియాంక తీసిన చీటీలో పార్టనర్ గా మానస్ పేరు రావడం మరో విశేషం. అలా ఎంతో సరదాగా గడిచిపోయింది.

ఇక ఆ తరువాత రవి పుట్టిన రోజన్న విషయం ఇంటి సభ్యులు నాగ్ కి చెప్పగా విషెస్ తెలియచేశారు. ఇక బర్త్డే సందర్భంగా మటన్ బిర్యానీ కావాలి సార్. ఇది  తినాలని ఉంది అని కాజల్ అడిగితే, మటన్ గ్యారంటీ అయితే వండుకుని తినమ్మా అంటూ కౌంటర్ ఇచ్చారు బాస్ నాగ్. దాంతో కాజల్ కాస్త ఒకే సార్ అంటూ కూర్చుంది. ఇక హౌస్ లోకి కొన్ని డెవిల్ స్టిక్కర్లు పంపిన నాగ్ వాటిని ఒక్కొక్కటిగా తీసుకుని తమ దృష్టిలో హౌస్ లో దెయ్యం ఎవరు ఎందుకు అన్న విషయాలు చెప్పమన్నారు. ప్రియాంక వచ్చి లోబోని రాక్షసుడు అంటూ స్టిక్కర్ అంటించింది. శ్రీ రామ్ స్టిక్కర్ ను మానస్ కి అంటించి తమ మధ్య కాస్త గ్యాప్ ఉందంటూ ప్రస్తావించాడు. మానస్ తీసుకోలేక పోతున్నారని...ఓటమిని అంగీకరించలేడని అంటూ చెప్పుకొచ్చాడు. శ్వేత స్వీట్ రాక్షసి అంటూ ఉమా దేవి కి స్టిక్కర్ అంటించింది.

ఇక షణ్ముక్ లాస్ట్ టైం టాస్క్ లో సిరి విషయంలో సన్నీ తప్పుగా ప్రవర్తించాడని తన టీ షర్టు లోపలకి చెయ్యి పెట్టి పిల్లో బయటకు తీశారు అని సిరి ఆరోపిస్తే... అవును అది నిజమే అంటూ షణ్ముఖ్ వత్తాసు పలికాడు. అయితే శనివారం ఎపిసోడ్ లో నాగ్ ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ చూపించగా అందులో సిరి టీ షర్ట్ లో చేయిపెట్టింది శ్వేత అని సన్ని కాదని క్లియర్ గా అర్థమైపోయింది. అయితే ఈ అంశంలో అనవసరంగా సన్నిని నిందించాను అంటూ చాలా పశ్చాత్తాప పడ్డ షణ్ముఖ్ అదే అంశాన్ని గుర్తుంచుకుని తనకు తానే రాక్షసుడు అంటూ స్టిక్కర్ ను అంటించుకున్నాడు . అయితే నాగ్ దీనికి ఒప్పుకోలేదు. కాగా చివరికి ఉమాదేవి హౌస్ లో నుండి ఎలిమినేట్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: