బుల్లితెరపై చిన్నారి పెళ్లి కూతురు గా మంచి పేరు సంపాదించుకుంది అవికాగోర్.. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో నటించే సమయానికి ఈమె వయస్సు పన్నెండు సంవత్సరాలు కావడం గమనార్హం.అలా సీరియల్స్ ని చేస్తున్న సమయంలోనే.. సినిమా అవకాశం గా ఉయ్యాల జంపాల మూవీ రావడం జరిగింది త ద్వారా ఆమెకు హీరోయిన్ గా అయ్యిందుకు అవకాశం వచ్చింది. దీంతో తన మొదటి అవకాశంతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది అవికా. ఇక అంతే కాకుండా పలు హింది సీరియల్స్ లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె సీరియల్స్ లో నటించడంతో నే అతి త్వరగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.తన మొదటి మూవీతోనే మంచి విజయాన్ని అందుకున్న అవికా.. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో ఆఫర్లు వచ్చాయి.. వరుసగా విజయాలతో దూసుకుపోతున్న సమయంలో కథల ఎంపిక సరిగా లేకపోవడంతో ఈమెకు సక్సెస్ రేటు తక్కువగా ఉందని చెప్పవచ్చు. అలా నెమ్మదిగా టాలీవుడ్ నుంచి కనుమరుగైపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఓంకార్ డైరెక్షన్ లో రాజుగారు గది -3 లో నటించింది. కానీ అది కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది ప్రేక్షకులను. దీంతో మరొకసారి ఈ ముద్దుగుమ్మ పరిస్థితి యథాస్థానానికి వచ్చింది. సినిమా ఆఫర్ల కోసం అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ ఉంటుంది.
ఇక తాజాగా ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసి.. తన అభిమానులకు మతిపోగొట్టే ఎలా చేస్తోంది అవికాగోర్. ఇక ఆ ఫోటోలు చూస్తే అవికాగోర్ ముందు తో పోలిస్తే మరింత అందంగా కనిపిస్తోందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాలలో బొద్దుగా కనిపించడం వల్ల ఈమె పై కొన్ని విమర్శలు కూడా ఎదురయ్యాయి. ప్రస్తుతం ఈమె ఫోటోలు చూస్తే చిన్నారి పెళ్లి కూతురు కదా అనే సందేహం వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: