కానీ బిగ్ బాస్ సీజన్ 5 లో వచ్చిన మరో కంటెస్టెంట్ సిరి హన్మంత్ తో తాను మసులుకున్న విధాన ఎందరినో ఆగ్రహానికి గురి చేసింది. ముఖ్యంగా దీప్తి సునైనా కు బాగా కాలింది. ఆ తర్వాత ఈ కారణం చేతనే షణ్ముఖ్ తో బ్రేక్ అప్ అయింది. ఇందుకు సిరి హన్మంత్ కారణం అంటూ ఎన్నో రూమర్స్ వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంపై అటు సిరి కానీ ఇటు షణ్ముఖ్ కానీ ఏమీ స్పందించలేదు. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ లో షణ్ముఖ్ జస్వంత్ మాట్లాడుతూ అసలు విషయాన్ని బయట పెట్టాడు. నా బ్రేక్ అప్ కు సిరి కు ఎటువంటి సంబంధం లేదని కుండబద్దలు కొట్టాడు. మా మధ్య ఉన్నది కేవలం స్నేహం అని చెప్పాడు.
ఇది ప్రేక్షకులకు వేరే విధంగా అర్థమైందని చెప్పాడు. ఈ విషయంలో అటు దీప్తి మరియు నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఇక భవిష్యత్తులో మళ్లీ మేము కలుస్తామా లేదా అన్నది విధి నిర్ణయిస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి