ఏ ఇండస్ట్రీలో నైనా సినిమాలకు ఉన్నంత క్రేజీ సీరియల్స్ కు కూడా ఉంటుందని చెప్పవచ్చు. చాలామంది ఇంట్లో గృహినిలు కూడా ఎక్కువగా టీవీ సీరియల్స్ కే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు. రాబోయే రోజులలో ఎక్కువగా సీరియల్స్ బుల్లితెరపై ప్రసారమయ్యే అవకాశం ఉన్నది..సీరియల్ చూసి ఎంతో మంది కూడా ఇలా ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా సీరియల్ కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు బుల్లితెర నటీనటులు. ఈ మధ్యకాలంలో సీరియల్స్ తీయాలన్నా కూడా కాస్త బడ్జెట్ ఎక్కువగానే ఉంటోంది. ఎందుచేత అంటే సీరియల్స్ కూడా చాలా కాస్ట్లీ కాస్ట్యూమ్స్ బంగారం, కార్లు, దుస్తులు వంటివి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. అందువల్ల సీరియల్స్ కూడా సినిమాను పోలిన విధంగా కనిపిస్తూ ఉంటాయి.


 అయితే దీని వల్ల నిర్మాతలకు కూడా భారీగానే బడ్జెట్ భారం అవుతోంది. ముఖ్యంగా మహిళలు సీరియల్స్ లో చాలా కలర్ ఫుల్ గా కనిపించడానికి కాస్ట్లీ చీరలను కట్టుకొని చాలా మెరిసిపోతూ ఉంటారు. ఇదంతా అలా ఉంచితే..అసలు విషయంలోకి వెళ్తే సీరియల్స్ లో నటించే నటి మనులు  చాలా కాస్ట్లీ చీరలు ధరిస్తూ ఉంటారు.మరి ఆ చీరలు ఎక్కడి నుంచి వస్తాయి.. వాటిని సొంతగా కొనుక్కుంటారా లేదంటే ఆ సీరియల్ యూనిట్ ఇస్తుందా అనే విషయం పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు.


సీరియల్ షూటింగ్ జరుగుతున్న సమయం లో కొంత మంది తమ సొంత చీరలు ఉపయోగిస్తారట.కానీ కొంతమందికి మాత్రం ప్రొడక్షన్ వాళ్లే చీరలు,కాస్ట్యూమ్ డిజైన్స్ ఇస్తూ ఉంటారని సమాచారం.ఇలా సంవత్సరాలు సీరియల్స్ కొనసాగుతూ ఉంటాయి కాబట్టి ఎవరికి డౌటు రాకుండా ఆ చీరలు నెల రోజులకు ఒకసారి మార్చి మార్చి కడుతూ ఉంటారట. ఈ విధంగా చేస్తే సీరియల్ చూస్తున్నా వారు కూడా ఎక్కువగా వీటిని గుర్తుపట్టలేరు. మొత్తానికి బుల్లితెరపై ఉపయోగించే చీరలను ఇలా ఉపయోగిస్తారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: